భారత్‌లో బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని ప్రస్తుతం బ్రిటన్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న పారిశ్రామిక వేత్త విజయ్‌ మాల్యాకు బ్రిటన్‌లో చిక్కులెదురయ్యాయి. గతంలో మాల్యా నిర్వహించిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు, సింగపూర్‌కు చెందిన బిఓసి వివాదంలో 9 కోట్ల డాలర్ల క్లయిమ్‌లను చెల్లించాల్సిందేనని బ్రిటన్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బీఓసీ ఏవిషయన్-కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం బీఓసీ ఏవియేషన్ నాలుగు విమానాలను కింగ్‌ఫిషర్‌కు లీజుకు ఇవ్వాల్సి ఉంది. అయితే మూడు విమానాలను మాత్రమే ఇచ్చిన బీఓసీ అడ్వాన్స్ సొమ్మును పూర్తిగా చెల్లించని కారణంగా నాలుగో విమానాన్ని ఇవ్వలేదు.

సంవత్సరాలు గడుస్తున్నా బకాయిలు చెల్లించకపోవడంతో బీఓసీ సంస్థ లండన్ హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన కోర్టు కింగ్‌ఫిషర్‌ను దోషిగా తేల్చింది.  అంతే కాదు ఆ సొమ్ము వడ్డీతో సహా చెల్లించాలని న్యాయమూర్తి జస్టిస్ పికెన్ ఆదేశించారు.భారత్‌లోని బ్యాంకులకు రూ.9 వేల కోట్లు ఎగవేసిన మాల్యా ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్నారు. మాల్యాను తిరిగి దేశానికి రప్పించేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. భారత్‌లోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టు భారీ షాకిచ్చింది. 
Image result for vijay mallya
కింగ్ ఫిషర్ లిక్కర్ కింగ్ గా ఒక్క ఊపు ఊపిన విజయ్ మాల్యాకు అప్పట్లో బ్యాంకులు పోటీ పడీ మరి అప్పులు ఇచ్చాయి. తీరా మనోడు దివాల తీయగానే..చిన్నగా బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం చేసి బ్రిటన్ కి జంప్ అయ్యాడు. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. 6.5 లక్షల పౌండ్ల పూచీకత్తు చెల్లించిన మాల్యా ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. వచ్చే నెల 16న తుది విచారణ జరగనుంది.
 



మరింత సమాచారం తెలుసుకోండి: