ఈ మద్య ప్రపంచలో ఎక్కడ చూసినా ఉగ్రవాదులు ఏ వైపు నుంచి దాడులు చేస్తారో తెలియని పరిస్థితి.  వారి టార్గెట్ సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఉంటుంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కోడలు వానెస్సాకు పార్శిల్‌‌లో వచ్చిన పౌడర్‌ కలకలం సృష్టించింది. కవర్‌ తెరవగానే తెల్లని పౌడర్‌ ఆమెపై పడింది. దీంతో వానెస్సా అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు తలతిరగడం, వికారంగా అనిపిండచంతో హుటాహుటిన న్యూయార్క్‌లోని ఆస్పత్రికి తరలించారు. 

వెనెస్సాతో పాటు ఆమె తల్లి, మరో వ్యక్తిని కూడా ఆస్పత్రిలో చేర్పించారు. డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌ పేరిట ఈ కవర్‌ వచ్చిందని పోలీసులు గుర్తించారు. అధ్యక్షుడి కుమారుడి ఇంటికి ఇలాంటి అనుమానాస్పద పార్సిల్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వనెసా ట్రంప్.. డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడైన డొనాల్డ్ జూనియర్ భార్య.ఘటనపై స్పందించిన న్యూయార్క్ పోలీసులు.. ఆ కొరియర్‌పై డొనాల్డ్ ట్రంప్ జూనియర్ అని రాసి ఉందని, అది అతని కోసమే వచ్చి ఉంటుందని తెలిపారు.
డొనాల్డ్ ట్రంప్ కోడలిపై ఆంత్రాక్స్ దాడి...
2016లో ఇలాంటి పౌడరే డొనాల్డ్ జూనియర్ సోదరుడి ఇంటికి కూడా వచ్చిందని చెబుతున్నారు.అమెరికాలో 2001లో ఇలా కవర్స్‌లో ఆంత్రాక్స్‌ వ్యాప్తి చేసే పౌడర్‌ను పంపించారు. మీడియా, శాసనకర్తలకు అలా పంపించడంతో అప్పట్లో అయిదుగురు వ్యక్తులు మరణించారు. అందుకే పార్సిల్‌లో పౌడర్‌ రావడంతో ఇప్పుడు అంతా ఆందోళన చెందారు.
ఆంథ్రాక్స్ కలకలం..
విచారణ అనంతరం అది ప్రమాదకరమైనది కాదని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు.ట్వీట్ చేయడం గమనార్హం. 'ఈ ఉదయం ఎదురైన భయానక, సంక్లిష్ట పరిస్థితుల నుంచి నా భార్య, పిల్లలు సురక్షితంగా బయటపడినందుకు థాంక్ గాడ్..'  అంటూ డొనాల్డ్ జూనియర్ ట్విట్ చేశాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: