టీడీపీ – బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలీదు కానీ నేతలు మాత్రం తగ్గట్లేదు. అటు బీజేపీ – ఇటు టీడీపీ ఆగ్రహావేశాల మధ్య వాస్తవాలను బయటపెట్టేస్తున్నారు. పోనీలే పాపం.. ఇలాగైనా వాస్తవాలు ప్రజలకు తెలిసొచ్చే అవకాశం కలుగుతోంది. తాజాగా కేంద్రం సాయానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరికొన్నింటిని బయటపెట్టారు.

Image result for TDP BJP

ప్రత్యేక హోదా పేరిట  ప్రజలను కొందరు  కావాలనే గందరగోళానికి గురి చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు.. విభజన హామీలు, బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై టీడీపీ చేస్తున్న విమర్శలను కొట్టిపారేసిన సోము.. అసలు కేంద్రం ఇచ్చిన నిధులను టీడీపీ ఖర్చుపెట్టిందా అంటూ ప్రశ్నించారు.  2017 బడ్జెట్‌ తర్వాత బడ్జెట్ చాలా బాగుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు ఇప్పుడు రాజకీయాల కోసం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు సోము వీర్రాజు.

Image result for TDP BJP

విభజన హామీలు, బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై టీడీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ప్రత్యేకహోదా, రాజధాని నిధుల విషయాలను ప్రస్తావించిన సోము వీర్రాజు అసలు.. ఇప్పటివరకు కేంద్రం ఇచ్చిన నిధులను ఎలా వినియోగించారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజ్‌భవన్‌, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మించాలని మాత్రమే విభజన చట్టంలో ఉందని, రాజధానిలో భవనాల నిర్మాణాలకు కేంద్రం 1500 వందల కోట్లు ఇచ్చిందని గుర్తుచేశారు.  ఇవికాక మరో వెయ్యి కోట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి విడుదలయ్యాయన్నారు సోము వీర్రాజు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇచ్చే నిధులను సమగ్రప్రణాళిక ద్వారా వాడుకోవడమే ప్రత్యేక ప్యాకేజీ అన్న సోము వీర్రాజు.. ఆ నిధులను అభివృద్ధికి వినియోగించేందుకు మీవద్ద బ్లూ ప్రింట్ ఉందా? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. దేశంలో విడిపోయిన రాష్ట్రాల్లో రైల్వే జోన్లే లేవన్నారు. రైల్వే జోన్‌, దుగరాజుపట్నం పరిశీలించాలని మాత్రమే బిల్లులో పెట్టారని పేర్కొన్నారు.

Image result for TDP BJP

స్వాతంత్ర్యం వచ్చాక దేశంలోని ఏ రాష్ట్రానికి... ఏపీకి ఇచ్చినన్ని నిధులు ఇవ్వలేదని.. ఈ మాట గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబే ఒప్పుకున్నారన్నారు సోము వీర్రాజు. కేంద్రమంత్రి సుజనాచౌదరి, మంత్రి గంటా శ్రీనివాసరావులు కూడా రాష్ర్టానికి వచ్చిన నిధులు, సంస్థలకు సంబంధించి చేసిన కామెంట్స్ పేపర్ కటింగ్స్ లను చూపించారు సోము వీర్రాజు. పోలవరం నిర్మాణం 5 ఏళ్లలో పూర్తి చేయాలని చట్టంలోనూ లేదని, అయినా పోలవరానికి ఎలాంటి అడ్డంకులు కేంద్రం తొలి కేబినెట్ భేటీలోనే ముంపు మండలాలను ఏపీలో కలిపామన్నారు. టీడీపీ నేతలు, వైఎస్ జగన్ కూడా అప్పడు పోలవరం గురించి మాట్లాడలేదన్నారు.

Image result for TDP BJP

కేంద్రం ఇప్పటికే ఏపీకి ఎక్కువ నిధులిచ్చిందన్న సోము వీర్రాజు, విభజన హామీలు నెరవేర్చడానికి 2022 వరకు సమయం ఉందన్నారు. ఐదేళ్లలోనే అన్ని చేయాలని కాంగ్రెస్‌ ఎందుకు బిల్లులో పెట్టలేదో ఆపార్టీని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. నిధుల పేరిట జరుగుతున్న రాజకీయ దుమారానికి సమాధానం చెప్పేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. సో... ఓ వైపు టీడీపీ, మరోవైపు బీజేపీ మాటల తూటాల మధ్య ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు ఏపీ ప్రజలకు కావాల్సింది కూడా ఇదే.! వాళ్లు ఎంత తిట్టుకుంటూ ఉంటే అంత మంచిది. ఎందుకంటే.. ఆ రూపంలోనైనా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. కాబట్టి .. నేతలూ.. తిట్టుకోండి..!!


మరింత సమాచారం తెలుసుకోండి: