జగన్ ఈ రోజు చెప్పిన మాటకు నిజంగానే టీడిపి కి గుండె ఆగెంత పనైంది. ప్రత్యేక హోదా ఇవ్వక పోతే తన పార్టీ ఎంపి ల చేత రాజీనామా చేయిస్తానని, అందుకు డెడ్ లైన్ కుడా పెట్టి అందరిని ఆశ్చర్య పరిచి నాడు. అయితే ఇంత దైర్యంగా డెడ్ లైన్ పెట్టి మరీ ప్రకటించడం అది ఒక్క జగన్ కే సాధ్యమైందని అందరు అభిప్రాయ పడుతున్నారు.
Image result for jagan
ఈ ఒక్క దెబ్బకు టీడిపి ఉలిక్కి పడింది. చివరికి టీడిపే దోషి గా తేలే ప్రమాదం ఉందని టీడిపి వారు గ్రహించినట్టున్నారు. అందుకే కొన్ని గంటల్లోనే ఎదురు దాడికి దిగుతున్నారు. ప్రత్యేకహోదా సాధించడం కోసం తమ పార్టీ ఎంపీలు అందరూ రాజీనామా చేయడానికైనా సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో అందుకు డెడ్ లైన్ కూడా విధించిన నేపథ్యంలో.. తెదేపా వర్గాలు మొత్తం కంగారు పడుతోంటే.. జేసీ మాత్రం వెరైటీగా ఎదురుదాడికి దిగుతున్నారు.
Image result for jc diwakar reddy
ఇప్పుడు ఎంపీలు రాజీనామా చేసినా కూడా ఏమాత్రం ప్రయోజనం ఉండదని, ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం కూడా లేదని ఎంపీగారు తన జోస్యం చెబుతున్నారు. ఏప్రిల్ 6న ఎంపీలు రాజీనామా చేసినా.. వాటిని ఆమోదించడానికి రెండునెలల కనీస వ్యవధి పట్టవచ్చునని, ఆ తర్వాత.. ఆ ఖాళీలను భర్తీ చేయడానికి 6నెలల వ్యవధి ఉంటుందని, ఆలోగా సార్వత్రిక ఎన్నికలే ముంచుకు వచ్చే అవకాశం ఉన్నదని ఆయన అంచనా వేశారు. అదంతా నిజమే కావచ్చు. కానీ నిన్నటిదాకా, ఇవాళ కూడా.. మేం రాజీనామాలు చేసేస్తాం అని తెలుగుదేశం నాయకులు పలికిన ప్రగల్భాల సంగతంతా ఏమిటి? 


మరింత సమాచారం తెలుసుకోండి: