భారత దేశపు రెండవ అతిపెద్ద బాంక్ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు లో అతి భారీ కుంభకోణం చోటు చేసుకుంది. పిఎంబి ముంబై ఒక బ్రాంచి లో భారీగా మోసపూరిత లావా దేవీలు చోటుచేసుకున్నట్టు వెల్లడైంది. తన బ్యాంకులో దాదాపు రూ.11,359  కోట్లకు ($ 1.77 బిలియన్) పైగా విలువైన మోసపూరిత లావాదేవీలను గుర్తించినట్టు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు బీఎస్‌ఈ ఫైలిం గ్‌లో పేర్కొంది. కొంతమంది ఖాతాదారుల ప్రయోజనార్థం ముంబై లోని తమ ఒక బ్రాంచి లో ఈ మోసపూరిత లావాదేవీలు జరిగాయని తెలిపింది. 

Image result for PNB Mumbai Branch where $1.77 Billion fraud detected


ఈ నగదును ముంబై బ్రాంచి నుంచి విదేశాలకు పంపినట్టు తెలిసింది. ఈ లావాదేవీల ఆధారంగా విదేశాల్లోని వినియోగదారు ల బ్యాంకు అకౌంట్లకు నగదును పంపినట్టు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఈ విషయాన్ని ఇప్పటికే "లా ఎన్-ఫొర్సుమెంట్  ఏజెన్సీలు"  లా ఎన్-ఫొర్సుమెంట్ డైరెక్టొరేట్ మరియు సి బి ఐ  విచారించడం ప్రారంభించా యని పీఎన్‌బీ తెలిపింది. పారదర్శకతమైన బ్యాంకింగ్‌ సేవలు అందించేందుకే బ్యాంకు కట్టుబడి ఉందని పీఎన్‌బీ చెప్పింది. ఈ వార్తల నేపథ్యంలో పీఎన్‌బీ బ్యాంకు షేరు భారీగా పడిపోయింది. దాదాపు 8శాతం ఈ బ్యాంకు షేరు క్షీణించింది. 

Image result for BSE CBI ED on Nirav Modi case with PNB

అయితే ఈ లావాదేవీలన్నీ "డైమండ్‌ మెర్చంట్‌ నిరవ్‌ మోదీ" ఆయన కుటుంబ సభ్యులు, వారి వ్యాపార బాగస్వామి మెహల్ చోక్సి ఈ అతి పెద్ద స్కాంకు పాల్పడినట్టు  బ్యాంకు ఆరోపిస్తోంది. ఈ కుంభకోణంలో భాగంగా 10 మంది ఉద్యోగులను సస్పెండ్‌ చేసినట్టు బ్యాంకింగ్‌ సెక్రటరీ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. దీనిపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ - సీబీఐ విచారణ చేపట్టింది. మొండి బకాయిలను గుర్తించడానికి ఈ విచారణ సహకరిస్తుందని రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఈ కుంభకోణం వల్ల బ్యాంకు కు ఎంత మేర నష్టం వాటిల్లుతుందో పీఎన్‌బీ వెల్లడించలేదు. ఎందుకంటే ఇది కంటింగెంట్ లయబిలిటీ కాబట్టి. 


గతంలో ఇదే బ్యాంకుకు సంబంధించి ₹ 280 కోట్ల చీటింగ్‌ కేసులో భాగంగా భారత అత్యంత ధనవంతుల్లో ఒకరైన సెలబ్రిటీ జువెల్లర్ నిరవ్‌ మోదీ ని గతవారమే సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు.


Image result for BSE CBI ED on Nirav Modi case with PNB


ఈ వార్తల మోసపూరిత లావాదేవీల విషయం కార్చిచ్చులా వ్యాపించిన నేపథ్యంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు షేర్ల విలువ బుధవారం మధ్యాహ్నం సమయానికి అతి ధారుణంగా పడిపోయాయి. పీఎన్‌బీ ముంబయి బ్రాంచ్‌ లో దాదాపు రూ.11,359 కోట్ల మేర భారీ కుంభకోణం జరిగినట్లు వార్తలు రావడంతో ఆ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నట్టు విశ్లేషకులు చెప్పారు. రూ.160 షేరు విలువతో బీఎస్‌ఈలో ట్రేడింగ్‌ ప్రారంభించిన పీఎన్‌బీ మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 8 శాతం పడి పోయింది. ప్రస్తుతం ఆ బ్యాంక్‌ షేరు విలువ రూ.150 వద్ద కొనసాగుతోంది. బ్యాంకు షేర్లు ఈ మేర నష్టపోతుండటంతో, పీఎన్‌బీ ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే దాదాపు రూ.3వేలకోట్ల సంపద ను కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: