ఈ మద్య రోడ్డుపై ఎవరైనా పకోడీలు అమ్ముకుని రూ.200 సంపాదిస్తే దాన్నే ఉద్యోగంగా భావించాలని మోడీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు రక రకాలు గా స్పందిస్తున్నారు.  తాజాగా ప్రధాని మోడీ ఇచ్చిన పకోడి సలహా నిరుద్యోగులకు తెగ నచ్చేసినట్లుంది. వ్యాపారం పెట్టుకుంటామంటూ రంగంలోకి దిగేస్తున్నారు. అయితే బిజెనెస్ కోసం సాయం చేయాలంటూ ఏకంగా నేతలకు లేఖలు రాసేస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకే ‘పకోడి బండి పెట్టుకుంటాను.. సాయం చేయరూ, ప్లీజ్..’ అంటూ లేఖను రాశాడు ఓ యువకుడు.
pakodi letter
అమేథికి  చెందిన అశ్విన్ మిశ్రా అనే నిరుద్యోగి.. ఈ లేఖాస్త్రం సంధించాడు. ‘‘ఓ టీవీలో ప్రధానమంత్రి పకోడి మాటలు విన్నాక.. నేను ఉద్యోగ ప్రయత్నాలను మానేశాను. మోదీ సలహా నాకు చాలా బాగా నచ్చింది. ఆనందం వేసింది. నేను పకోడి బండి పెట్టుకోవడం వల్ల నా కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా.. ఇతరులకూ పని కల్పించిన వాడినవుతాను.  మరో ఇద్దరు ముగ్గురికి కూడా ఉపాధి కల్పించవచ్చన్నారు. అయితే వ్యాపారం మొదలు పెట్టేంత ఆర్థిక స్థోమత తనకు లేదన్నారు.

అంతేకాదు లోన్ కోసం బ్యాంకులు చుట్టూ తిరిగానని... కాని ఎవరూ ఇవ్వలేదన్నారు.  ప్రధాన మంత్రి ముద్ర యోజన కిందైనా తనకు లోన్ ఇవ్వాలని అడిగారు. మోడీ ఇచ్చిన సలహా తప్పుకాదని తాను అనుకుంటున్నానని... సలహా ఇచ్చినట్లే లోన్ ఇవ్వాలని బ్యాంకుల్ని సూచించాలన్నారు. మరోవైపు ఈ లేఖను ప్రస్తావిస్తూ బీజేపీపై కాంగ్రెస్ కౌంటర్లు ఇచ్చింది. బీజేపీ చేస్తున్న పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని... ఇదే ఓ ఉదాహరణ మాత్రమేనని సెటైర్ వేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: