టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి, ఆంధ్రా షుగర్స్ ఛైర్మన్ బోళ్ల బుల్లిరామయ్య తణుకులోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆంధ్రా షుగర్స్‌ను 600 టన్నుల నుంచి 6వేల టన్నుల సామర్థ్యానికి పెంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 

నాలుగు సార్లు పార్లమెంట్ ఎంపీగా ఆయన ఎన్నిక అయ్యారు. కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. బోళ్ల బుల్లిరామయ్య మృతికి టీడీపీ శ్రేణులు, నేతలు సంతాపం తెలిపారు.1926 జులై 9న తూర్పుగోదావరి జిల్లా తాటిపాకలో ఆయన జన్మించారు. ఆంధ్రాషుగర్స్‌లో 1953లో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు.

ప్రస్తుతం ఆంధ్రా షుగర్స్ చైర్మన్, ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. బోళ్ల బుల్లిరామయ్య మృతికి టీడీపీ శ్రేణులు, నేతలు సంతాపం తెలిపారు.ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు సంతాపాన్ని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: