ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కావాలంటే మార్పు ముఖ్యమంత్రి లో రావాలంటున్నారు విఙ్జులైన విద్యావంతులు,  అనుభవజ్ఞులైన విశ్రాంత ఉద్యోగులు, అదీ ఉన్నత స్థానంలో పనిచేసిన వారు. వారికి చట్టం  తెలుసు విధానం తెలుసు. అలాంటి వాళ్ళ సలహా లను ప్రభుత్వం మన్నిస్తే పాలన సజావుగా ప్రజలు మెచ్చేదిగా ఉంటుంది. "పెద్దల మాట చద్ది మూట"  గదా! అలా కాకుండా చెప్పేవారి సలహా వల్ల మన స్వార్ధ ప్రయొజనాలు నేరవేక వారిని నిందిస్తే ప్రయోజనం లేదు. వారిని మందలిద్ధామంటే వారు మన కులపోడో,  మనప్రాంతం వాడో కాక మన సిద్ధాంతాలు నచ్చనివాడు కూడా! అందుకే పరిస్థితులు "ఇంతే సంగతులు చిత్త గించవలెను" అవుతుంది. అదే జరిగింది ఇక్కడ. 

Image result for ap cm with iyr krishna rao


రాజధాని ప్రాంత అభివృద్ధికోసం-సి అర్ డి ఏ- స్విస్‌ చాలెంజ్‌ విధానానికి ఆమోదముద్ర వేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ను ఆయన విధానాలను నిలువెల్లా తూర్పార పడుతున్న మాజీ సీ ఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ఇప్పుడు మరోసారి ఆసక్తిదాయకమైన రీతిలో స్టన్నింగ్ గా స్పందించాడు. ఇప్పటి కే చంద్రబాబుగారి కలల రాజధాని అదే భ్రమరావతి అంటే అమరావతి గురించి వేడి వేడి గా స్పందిస్తున్న ఈ మాజీ ఐఏఎస్,  అలా తీసుకున్న నిర్ణ యాన్ని సవాల్‌ చేస్తూ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ స్విస్‌ చాలెంజ్‌ విధానం "ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఎనేబలింగ్‌ చట్టం" (ఏపీఐడీఈ) నిబంధనలకు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని, అందువల్ల దాన్ని కొట్టివేయాలని న్యాయస్థానాన్ని కోరారు. దీన్ని తాత్కాలిక ప్రధానన్యాయమూర్తి (ఏసీజే) నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 20న విచారణ జరిపే అవకాశం ఉంది.


Image result for ap cm with iyr krishna rao


అనేక రాష్ట్రాల్లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఇప్పటికే న్యాయస్థానాల్లో స్విస్ ఛాలెంజ్ విధానాలకు అంతటా చుక్కె దురు అయ్యింది. ఈ నేపథ్యంలో చంద్ర బాబు ప్రభుత్వం రాజధాని నిర్మాణం విషయంలో అనుసరిస్తున్న ఈ పద్ధతిపై ఐవైఆర్ పిటిషన్ వేయడం ప్రజల అటెన్షన్ తో ఆసక్తి దాయకం అయింది.  సీ ఆర్ డీ ఏ అనుసరిస్తున్న ఈ విధానంపై ఇప్పటి లో అనేక పిటిషన్లు కోర్టులలో మూలుగుతున్నాయి. అయితే, రాజధాని విషయంలో గత మూడేళ్లలో కోర్టుకు చేరిన పిటిషన్లు నిలవ లేదు. నిలబడినవన్నీ క్రమంగా వాయిదాల పద్ధతిన అవి తెరమరుగు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఐవైఆర్ పిటిషన్ కు ఎలాంటి స్పందన ఉంటుందనేది ఆయనకి తెలియని విషయం కాదు! 

Image result for ap cm with iyr krishna rao


ఐవైఆర్ అనుభవజ్ఞుడైన విశ్రాంత సీఎస్, ఐఏఎస్ కాబట్టి, అల్లాటప్పాగా న్యాయస్థానంలో పిటిషన్ వేస్తారని ఎలా అను కుంటాం!  పిటిషన్లో విధానపరమైన కీలక విషయాలనే ప్రస్తావించి ఉండే ఉంటారు, చట్టాలు పాలనా విధానాలు తెలిసి తల పండిన వారు. చూద్ధాం  జరగబొయ్యేది త్వరలోనే. 


Image result for swiss challenge in ap


కొసమెరుపే మంటే  వ్యూహ చతురుడు విందు రాజకీయాలు అద్భుతంగా చేసే నేర్పున్న అనుభవజ్ఞుడికి,  ఈ వ్యవహారంతో సంబంధం ఉందో?  లేదో?  కాని ఈ మద్య కోర్టు సిబ్బందికి  ప్రత్యేక విందు ఇచ్చారని దానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబీకులు కూడా హాజరయ్యాయరని ప్రచారంలో ఉంది. అయితే న్యాయస్థానాల్లో పని చేసే సిబ్బందికి అమరావతి విశ్వనగరం వరస పెట్టి విందులు ఇవ్వటం గడచిన మూడేళ్లలో రెండు సార్లు, ఇలాంటి విందులు, వినోదాలు, విలాసాలలో ఓలలూగించినట్లు ఏపి ప్రజావాహినిలో ముఖ్యంగా అమరావతి నోళ్ళలో నానుతున్న సమాచారం. ఎందుకంటారు?  అని విజ్ఞులు అంటున్నారు. 

Image result for swiss challenge in ap

మరింత సమాచారం తెలుసుకోండి: