సన్నీ లియోన్.. ఇప్పటికీ వన్నెతగ్గని సెక్సీ తార. మొదట పోర్న్ స్టార్ గా ప్రపంచాన్ని అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పోర్న్ వంటి బూతు సామ్రాజ్యాన్ని వదిలేసి.. ఇండియన్ సినిమా స్క్రీన్ ను ఏలేస్తోంది. మొదట్లో బూతు తార అంటూ దూరం పెట్టినా.. ఆ తర్వాత వరుస అవకాశాలతో ఈ ముద్దు గుమ్మ దూసుకుపోతోంది. హిందీలోనే కాకుండా ప్రాంతీయ సినిమాల్లోనూ నటిస్తోంది. 



ఐతే. సన్నీ లియోన్ అంటే ముందుగా గుర్తొచ్చేది అందాల ప్రదర్శనే. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ సన్నీ లియోన్ అందాలను ఎంజాయ్ చేయడం కోసం కాకుండా వేరే ఫలితం కోసం ఉపయోగిస్తున్నాడో పెద్దాయన. ఆయన ప్రయత్నం ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. పల్లెటూళ్లలో దిష్టి కోసం దిష్టి బొమ్మలను వాడే ఆచారం ఎప్పటి నుంచో ఉంది.

ఈ పెద్దాయన తన పంటకు దిష్టి బొమ్మగా అందాల సన్నీలియోన్ అర్థ నగ్న చిత్రాన్ని ఉంచాడు. తన పంట పొలం ముందు బికినీతో అందాలొలికిస్తున్న సన్నీలియోన్ ఫ్లెక్సీ ఉంచాడు. దానిపైన ఒరేయ్.. నన్ను చూసి ఏడవకురా అనే క్యాప్షన్ కూడా రాయించాడు. ఈ ఫ్లెక్సీ వల్ల తన పంటకు దిష్టి తగలదని.. దిష్టి అంతా సన్నీలియోన్ పైనే వెళ్లిపోతుందనేది ఈ పెద్దాయన ఆలోచన. వారెవా.. సన్నీని ఇలా కూడా ఉపయోగించిన ఈ తెలివికి జోహార్లు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: