ఐఏఎస్ ఆఫీసర్.. నిజంగా సేవాభావం ఉంటే.. ప్రజలకు సేవ చేసేందుకు దేశంలో ఉన్న అత్యంత ఉన్నతమైన ఉద్యోగం. కానీ చాలా మంది దీన్ని ప్రజల అభివృద్ధి కోసం కాకుండా తమ వ్యక్తిగత అభివృద్ది కోసమే ఉపయోగిస్తుంటారు. ఎన్నో ఆశయాలతో ఐఏఎస్ అధికారి అయినా.. వాటిని క్రమంగా మర్చిపోయి... తమదైన లోకంలో తాము ఉండిపోతారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తరాలకు సరిపడా సంపాదిస్తుంటారు..  ఆకురాతి పల్లవి వంటి ఆఫీసర్లు మాత్రం ఇందుకు చాలా భిన్నం. ఈ తెలుగు ఐఏఎస్ అధికారి కర్ణాటకలో ఓ సంచలనం. 2009 బ్యాచ్. కర్ణాటక కేడర్. 6 సంవత్సరాల సర్వీస్. 9 ట్రాన్స్ఫర్లు.. అవును పల్లవి ఎక్కడా రాజీపడకుండా బతికింది. అలానే ఉద్యోగం చేసింది. చేస్తోంది.

akurathi pallavi ias కోసం చిత్ర ఫలితం

ఈ 33 ఏళ్ల యువతి అంటే కర్ణాటకలోని నాయకులకు మంట. భయం. ఒకటే కారణం. ఆమె ఎక్కడకు వస్తే అక్కడ అవినీతిపరులు హడలెత్తాల్సిందే.  పనిచేయని ఉద్యోగులు విలవిల్లాడాల్సిందే. ఆవిడ ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఇంటర్ పరీక్ష పేపర్ వాట్సాప్ ద్వారా లీకైంది. ఆమె పరీక్షను రద్దు చేశారు. రీ ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయింది. అక్కడ ఎగ్జామ్ మాఫియా ఎంత బలంగా ఉందో, ఇంటర్ బోర్డు వాళ్లు ఆ మాఫియాకు ఏ రేంజ్‌లో సహకరిస్తున్నారో అప్పుడు అర్థమైంది పల్లవికి. మళ్లీ రెండో ఎగ్జామ్ కూడా రద్దు చేసారు. కేసు నమోదు చేసి, విచారణ సిఐడికి అప్పగించారు. విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.

akurathi pallavi ias కోసం చిత్ర ఫలితం
.
ఈ పేపర్ లీకేజ్ ముఠాలు వందల కోట్ల టర్నోవర్ తో వ్యాపారాలు చేస్తున్నాయి. పల్లవి పుణ్యమా అని వాళ్ల గుట్టు రట్టయింది. ఎండోమెంట్ కమీషనర్‌గా పల్లవి విజయాలు కూడా చాలా ఫేమస్.
 తను దాదాపు 600 కోట్ల రూపాయల విలువైన దేవాదాయ ఆస్తులను కాపాడారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. తెలుగు మీడియంలో ఐఎఎస్ పాస్ అయిన మొదటి మహిళ ఆకురాతి పల్లవే.

సంబంధిత చిత్రం
గుంటూరు జిల్లాకు చెందిన పల్లవి సివిల్స్‌లో 101వ ర్యాంకు సాధించింది. పల్లవిలో చాలా కళలు ఉన్నాయి. ఆమె ఒక కూచిపూడి డాన్సర్, తెలుగు కవయిత్రి. పెయింటింగ్ తన హాబీ. బట్టల ఎంబ్రాయిడరీలో దిట్ట. సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వారికి ఉచితంగా శిక్షణ ఇస్తుంది. పేద అమ్మాయిలకు తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చి కోచింగ్ ఇస్తోంది. పల్లవి పెళ్లి చాలా సింపిల్‌గా గుడిలో పెళ్లి చేసుకోవడం ద్వారా మిగిలిన డబ్బుతో ఇద్దరు పేద పిల్లలను చదివిస్తోంది. చాలా గ్రేట్ కదా.



మరింత సమాచారం తెలుసుకోండి: