నిన్నమొన్నటి వరకూ కలిసి ఉన్న పార్టీలు ఇప్పుడు కత్తులు దూసుకుంటున్నాయి. ఏపీకి కేంద్రం చేసిన సాయంపై పరస్పర భిన్నమైన ప్రకటనలు చేస్తున్నాయి. మేం ఎక్కువే సాయం చేశామని కేంద్రం చేబుతుంటే.. అబ్బే.. అందరిలాగానే మాకూ ఇచ్చారు. ప్రత్యేకంగా ఏమిచ్చారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మరి వాస్తవంగా ఏం జరిగింది.. కేంద్రం ఏం ఇచ్చింది..ఏపీ ఏం చెబుతోంది.. ఒకసారి చూద్దాం..

tdp mps in parliament కోసం చిత్ర ఫలితం
విభజన తర్వాత మొదటి ఏడాది బడ్జెట్ లో రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని పార్లమెంటులో ప్రధాని ఇచ్చిన హామీ ప్రకారం 3979 కోట్లు రాష్ట్రానికి చెల్లించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.హరిబాబు చెబుతున్నారు. కానీ.. రెవెన్యూ లోటును పూర్తిగా భర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. దాదాపు 16 వేల 78 కోట్లు చెల్లించాలని ఏజీ ధృవీకరించారు. ఇప్పటివరకూ కేంద్రం చెల్లించింది 3979 కోట్లు మాత్రమే.

tdp mps in parliament కోసం చిత్ర ఫలితం
రాజధాని నిర్మాణంలో రాజ్ భవన్, హైకోర్టు, ప్రభుత్వ సచివాలయం, అసెంబ్లీ భవనాలు, ఇతర కీలకమైన మౌలిక సదుపాయాల విషయంలో ఇప్పటి వరకూ 2500 కోట్ల రూపాయలు చెల్లించినట్టు హరిబాబు అంటున్నారు. కానీ.. రాజధాని నగరం నిర్మాణం కోసం 10 వేల కోట్ల రూపాయల మేర డీపీఆర్ ను పంపితే కేవలం 1500 కోట్లు మాత్రమే విడుదల చేసిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఏపీ లోని వెనుకపడిన జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహాలో నిధుల పంపిణీ చేయాలన్న అంశంపై రాయలసీమకు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద 1050 కోట్లను ఇచ్చినట్టు కేంద్రం స్పష్టం చేసింది.

BJP HARIBABU కోసం చిత్ర ఫలితం
కానీ టీడీపీ నేతల వాదన ఇందుకు భిన్నంగా ఉంది. ఈ మూడేళ్లలో రాయల సీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు 1050 కోట్ల రూపాయల ప్రత్యేక ఆర్ధిక సాయం ఇస్తే.. బుందేల్ ఖండ్ కు మాత్రం 7266 కోట్లు ఇచ్చారని చెబుతోంది. ఇక ఈఏపీ ప్రాజెక్టుల విషయంలో ఐదేళ్ల కాలపరిమితిని పెంచాల్సిందిగా కోరినా ఇప్పటికీ నెరవేరలేదని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. ఇక పోలవరం కోసం ఇప్పటి వరకూ 4662 కోట్ల రూపాయలను విడుదల చేసినట్టు బీజేపీ చెబుతోంది. టీడీపీ నేతలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 7780 కోట్ల రూపాయల్లో కేంద్రం ఇప్పటి వరకూ 4329 కోట్లను మాత్రమే ఇచ్చిందంటున్నారు. మిగిలిన 3451 కోట్లను చెల్లించాలని డిమాండ్ చేస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: