భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ దేశానికి ఏదో కట్టబెడుతుందని భావించిన దేశ శ్రేయోభిలాషులకు ప్రజలకూ రోజుకోవార్త రూపంలో చుక్కలు చూపిస్తుంది. వారిచ్చే వరాలు ఆశచూపే వాగ్ధానాలు అసలు అమలుకు నోచుకుంటాయా అనేది సర్వదా ప్రశ్నార్ధకమే. మతపరమైన సున్నితమైన అంశాలపై కూడా బాజపా ఏమాత్రం సున్నితం గా స్పందించటం లేదు. 

Image result for nagaland capital with modi

ఈ మద్యనే ముస్లింలకు హజ్ సబ్సిడీని తొలిగించిన నెలైనా గడవకముందే కేంద్ర ప్రభుత్వం, తాజాగా బీజేపీ క్రైస్తవులకు జెరూసలేం ఉచిత యాత్ర ను ప్రకటించింది. త్వరలో జరుగనున్న నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే క్రైస్తవులను ఉచితంగా జెరూసలేం యాత్రకు పంపుతామని బీజేపీ హామీ ఇచ్చింది. అయితే ఈ హామీ కేవలం నాగాలాండ్‌ కే పరిమితమా? ఈశాన్య రాష్ట్రాల్లోని క్రైస్తవులందరికీ కల్పిస్తారా? దేశంలోని క్రిష్టియన్లందరికి ఈఏర్పాటు వర్తిస్తుందా? అనే విషయాన్ని స్పష్టం గా చెప్పలేదు. త్వరలో ఎన్నికలు జరుగనున్న ఈశాన్య రాష్ట్రాలు మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర ఎన్నిక లను దృష్టిలో ఉంచుకొని ఈ హామీని బీజేపీ తెరపైకి తెచ్చినట్లు తెలుస్తున్నది. 

Image result for jerusalem

మేఘాలయలో 75శాతం జనాభా, నాగాలాండ్‌లో 88 శాతం జనాభా క్రైస్తవులే. ఈమేరకు క్రైస్తవులను తమవైపు తిప్పుకునేందు  కు బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. నాగాలాండ్‌లో తమకు అధికారం కట్టబెడితే, క్రైస్తవులకు ఉచితంగా జెరూసలేం యాత్రకు పంపుతామని బీజేపీ వాగ్దానం చేస్తున్నది అని "వుయ్ ది నాగాస్" అనే వార్తాసంస్థ ట్విట్టర్‌లో వెల్లడించింది. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఎన్నాళ్లుగానో ఇస్తున్న రాయితీని నెలరోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. తద్వారా మిగిలే నిధుల ను మైనార్టీల సంక్షేమానికి ఉపయోగిస్తామని ప్రకటించింది.

Image result for nagaland capital with modi

మైనార్టీలను బుజ్జగించడం కోసం కాకుండా, వారికి సగౌరవంగా సాధికారత కల్పించేందుకే తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తున్నదని అప్పట్లో కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ తెలిపారు. ఈ నేపథ్యంలో బీజేపీ తాజా హామీని హైదరాబాద్ ఎం ఐ ఎం పారలమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ తప్పు పట్టారు. ఎన్నికలను దృష్టి లో ఉంచుకొని బీజేపీ క్రిస్టియన్లను ఉచితంగా జెరూసలేం పంపుతామని హామీ ఇస్తున్నది.

Image result for nagaland capital with modi

సబ్సిడీ ఏదైనా సరే, అందరికీ ఒకేలా ఉండాలి. ముస్లింలకు హజ్ సబ్సిడీని తొలిగించడం, హిందూవులకు మానస సరోవరం యాత్ర సబ్సిడీని కొనసాగించడం, క్రిస్టియన్ల ను ఉచితంగా జెరూసలేం పంపుతామని ప్రకటించడం సరైన పద్ధతి కాదు అని అసదుద్దీన్ తెలిపారు. ఎన్నికల్లో ఉపయోగపడేలా ఉంటే బీజేపీ ముస్లిం లకు కూడా రాయితీ కొనసాగించేదని, ఇదే ఆ పార్టీ నమ్మిన "ఇండియా ఫస్ట్" నినాదమని ఆయన ఓ ట్వీట్‌లో విమర్శించారు. 

Related image

మతపరమైన యాత్రలకు రాయితీలు ఇవ్వడాన్నే తాము వ్యతిరేకిస్తున్నట్లు సీపీఎం తెలిపింది. మరోవైపు బీజేపీ హామీపై ఇజ్రాయెల్ మీడియా భిన్నంగా స్పందించింది. ప్రభుత్వాలు యాత్రికు లను సబ్సిడీపై పుణ్యక్షేత్రాలకు పంపాలనుకోవడం ఇదేమీ తొలిసారి కాదని, నైజీరియా తమ దేశంలోని ముస్లిం, క్రిస్టియన్ యాత్రికులను మక్కా, జెరూసలేంకు ఏటా పంపుతున్న దని జెరూసలేం పోస్ట్ అనే పత్రిక తెలిపింది. అయితే ఈ తరహా ఎన్నికల హామీలన్నీ తర్వాత క్రమంగా మరుగున పడుతాయ ని వ్యాఖ్యానించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: