ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)లో ’భారీ కుంభకోణం’ వెలుగుచూసింది. 1.77 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 11,346 కోట్లు) మేర ప్రభావం చూపే మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు తేలింది. ముంబైలోని ఓ శాఖలో ఇవి జరిగాయని గుర్తించినట్లు పీఎన్‌బీ వెల్లడించింది. కొంత మంది ఖాతాదారులతో కుమ్మక్కైన కొందరు ఉద్యోగులు.. వారికి ప్రయోజనం చేకూర్చేలా మోసపూరిత, అనధికారిక లావాదేవీలు జరిపినట్లు తెలిపింది. ఈ కుంభకోణానికి సంబంధించి వజ్రాభరణాల డిజైనర్‌ నీరవ్‌ మోదీతో పాటు ఒక ఆభరణాల సంస్థపై సీబీఐకి పీఎన్‌బీ నుంచి రెండు ఫిర్యాదులు అందాయి.
More Indian banks entangled in PNB fraud - Sakshi
ఇప్పటికే రూ. 281 కోట్ల మేర మోసం చేశారన్న పీఎన్‌బీ ఫిర్యాదుతో నీరవ్‌ మోదీ, ఆయన భార్య అమీ, సోదరుడు నిషాల్, వ్యాపార భాగస్వామి మెహుల్‌ చీనుభాయ్‌ చోక్సీలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది.మోడీ దాదాపు 11 వేల కోట్ల 400 రూపాయలకు టోపీ పెట్టేశాడు.. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు కుంభకోణానికి తెరలేపాడు. ఆయన తెలివిగా దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ను నిలువునా ముంచేశాడు. ఇప్పుడు దేశంలో ఇదే హాట్ టాపిక్.  ఏకంగా 11వేల 400కోట్ల రూపాయల కుంభకోణం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిరావ్ మోదీ అనే వజ్రాల వ్యాపారి డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ స్థాయిలో ఉన్న అధికారులు, కొందరు ఖాతాదారులు కుమ్మక్కయ్యాడు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 11 వేల కోట్ల కుంభకోణం!
2011 నుంచి ఈ అక్రమాలకు పాల్పడ్డాడు. అంతేకాదు.. ఇతర బ్యాంకుల ద్వారా ఆ నిధులన్నీ విదేశాలకు తరలిపోయాయి.  పాత లావాదేవీల విశ్లేషిస్తే ఈ దారుణం బయటపడింది. ఈ కుంభకోణంపై దర్యాప్తు సంస్థలకు ఇప్పటికే సమాచారం ఇచ్చి 10మంది అధికారుల్ని సస్పెండ్‌ చేసినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు తెలిపింది. అక్రమ లావాదేవీలతో ఏమేర నష్టం జరిగిందో ఇంకా తెలియదని.. విచారణ తర్వాతే స్పష్టత వస్తుందని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ చెబుతోంది.పీఎన్‌బీ తాజా ఫిర్యాదుతో నీరవ్‌ మోదీ మరో కేసును కూడా ఎదుర్కొనాల్సి రానుంది. మరోవైపు, ప్రస్తుత ఉదంతంతో.. నీరవ్‌ మోదీ సహా నాలుగు బడా జ్యుయలరీ సంస్థలపైనా దర్యాప్తు సంస్థలు దృష్టి సారించినట్లు ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. 
stocks--thinkstock

ఈ సంస్థలు వివిధ బ్యాంకులతో నిర్వహిస్తున్న లావాదేవీలు, తీసుకున్న నిధులను ఏ విధంగా ఉపయోగిస్తున్నాయి తదితర అంశాలను సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పరిశీలిస్తున్నట్లు వివరించారు. అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చింది.  ఇంత పెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు షేర్లు దాదాపు 10శాతం నష్టపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: