ప్రపంచంలో టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది..అయితే దీని వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో..నష్టాలు దారుణమైన నష్టాలు ఉన్నాయి.  ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఇంటర్ నెట్ అందుబాటులో ఉంటుంది.  దీంతో యువత ఎక్కువ శాతం తమ సెల్ ఫోన్లలో ఫోర్న్ చిత్రాలు చూడటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.  రీసెంట్ గా రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన గాడ్ సెక్స్ ట్రూత్ లఘు చిత్రం రిలీజ్ చేసే ముందు ఓ డిబెట్ లో యువతీ యువకులు తాము ఫోర్న్ సినిమాలు చూస్తున్నామని బాహాటంగానే చెప్పారు.
అరికట్టే దిశగా సుప్రీం..:
ఈ చిత్రాలు యువతనే కాదు మద్య వయస్కులు, వృద్దులు కూడా చూస్తున్నారని పరిశోదనలో తేలింది. తాజాగా పోర్నోగ్రఫీ కాపురాల్లో చిచ్చు పెడుతోంది. తీరిక దొరికితే చాలు స్మార్ట్ ఫోన్ లో పోర్న్ వీడియోలు చూస్తూ బతికేస్తున్న భర్తలతో భార్యలు అష్టకష్టాలు పడుతున్నారు. ఎంతో మంది మహిళలు  తమ భర్తలు పోర్న్‌కు బానిసలయ్యారని బాధితులు కోర్టుకెక్కుతూనే ఉన్నారు. . 2013లో పోర్నోగ్రఫీని బ్యాన్ చేయాలంటూ దాఖలైన పిల్(ప్రజా ప్రయోజన వ్యాజ్యం)లో వీరంతా భాగస్వాములు అవుతున్నారు.
నాతోనూ లైంగికంగా గడపడం లేదు: ఓ బాధితురాలు
పోర్న్ లేకుండా చేస్తే గానీ తమ కాపురాలు నిలబడవని మొరపెట్టుకుంటున్నారు.  ఎదుగుతున్న పిల్లలు ఉన్నారన్న సంగతి కూడా మరిచిపోయి.. ఇంట్లో ఉన్నంతసేపూ ఆ వీడియోల్లోనో మునిగి తేలుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'పోర్న్' వల్ల ఇల్లు, కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని.. ఇప్పటికైనా ఇండియాలో దాన్నినిషేధించాలని వారు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇంటర్నెట్‌లో పోర్న్‌ వీడియోలు పదేపదే చూస్తూ నా భర్త వికృతంగా మారిపోయాడు.
Image result for porn videos watching cells in india
రోజువారీ వ్యవహారాలు కూడా అతను విస్మరించి బూతులు వీడియోలు చూస్తున్నాడు. దారుణమైన విషయం ఏంటేంటే..కొన్ని సందర్భాల్లో అసహజ శృంగారానికి పాల్పడాలని నన్ను బలవంతపెడుతున్నాడు. అతడి తీవ్ర వికృతమైన మా ప్రవర్తనతో మా వైవాహిక జీవితం నాశనమయ్యే పరిస్థితి నెలకొంది అని ముంబై మహిళ తన అఫిడవిట్‌లో ఆవేదన వ్యక్తం చేసింది. స్మార్ట్‌ఫోన్ల వల్ల మిలియన్లకొద్దీ భారతీయులకు పోర్న్‌ వీడియోలు సులువుగా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా తక్కువధరకు బూతు వీడియోలు మెమరీకార్డులో నింపుకునే అవకాశమూ అందుబాటులో ఉంది. 2017 ఫిబ్రవరిలో ఓ వివాహిత, అంతకుముందు 12వ తరగతి విద్యార్థి అకాశ్‌ నర్వాల్‌ కూడా ఇదే అభ్యర్థనతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Image result for porn videos watching cells in india
చైల్డ్‌ పోర్న్‌ బాలలపై లైంగిక దాడుల వీడియోలు, ఫొటోలను అరికట్టేందుకు మాత్రం ఇంటర్‌పోల్‌తో కలిసి చర్యలు తీసుకుంటున్నట్టు మోదీ ప్రభుత్వం గతంలోనే సుప్రీంకోర్టుకు తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో పోర్న్‌ వీడియోలు చూడటంపై నిషేధం విధించడం, దీనిని నేరంగా పరిగణించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని సూచించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: