టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన పవన్ కళ్యాన్..హీరోగా మంచి ఫామ్ లో ఉన్నాడు.  అయితే ఇప్పుడు సినిమాలే కాదు రాజకీయాల్లో కూడా తనదైన దూకుడు పెంచాడు పవన్ కళ్యాన్.  సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘జనసేన’ పార్టీ స్థాపించిన పవన్ కళ్యాన్ అప్పట్లో బీజేపీ, టీడీపీలకు మద్దతు పలికారు..ఆ పార్టీ తరుపు నుంచి ప్రచారం కూడా చేశారు.  జనసేన పార్టీ స్థాపించి మూడున్నర సంవత్సరాలు కావొస్తుంది..ఇక వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన బోతున్న పవన్ కళ్యాన్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ..పార్టీ పటిష్టత పెంచుకోవాలని చూస్తున్నారు.
pavan jfc 15022018 3
అయితే ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ఎప్పటి నుంచో పవన్ కళ్యాన్ పోరాడుతున్నారు.  ఇందు కోసం పవన్ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకతాటిపై తీసుకొచ్చి కేంద్రం పై వత్తిడి తేవాలని ప్రయత్నిస్తున్నారు.  ఇందుకోసం పలు సీనియర్ నాయకులతో భేటీ అవుతున్న విషయం తెలిసిందే. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం జరిగిన టీడీపీ నేతల సమన్వయ కమిటీలో పవన్ పేరు ప్రస్తావనకు వచ్చింది.
pavan jfc 15022018 2
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పవన్ జేఏసీపై స్పందించారు. పవన్ కల్యాణ్  ఆయన పని ఏదో చేసుకుంటున్నాడు  పోనివ్వండి.  పవన్ జేఎఫ్‌సీతో మనకు ఇబ్బంది లేదు, పవన్ పోరాటంలో అర్థం ఉంది... రాష్ట్రానికి మేలు చేయాలని పవన్ పోరాటం చేస్తున్నారు.. అని నేతలతో చంద్రబాబు చెప్పారు.  నిధుల వివరాలు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పవన్ విధించిన డెడ్‌లైన్‌పై కూడా చంద్రబాబు చర్చించారు. శ్వేత పత్రం ఇవ్వాల్సింది కేంద్రమేనని, రాష్ట్ర ప్రభుత్వం కాదని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్వేత పత్రం అడిగితే సున్నితంగా సమాధానం చెప్పాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు.
pk
పోలవరవం లెక్కలు లాంటివి, పారదర్శకంగా వెబ్ సైట్లో కూడా ఉంచామని, ఇంకా పవన్ కల్యాణ్ కు కొత్తగా ఇచ్చేదేముంటుందనే విషయాన్ని సున్నితంగా వివరించాలని నాయకులకు సూచించారు.పవన్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాటం చేస్తున్నారని అనే అభిప్రాయం ఉందని, మనది కూడా అదే ఆరాటమన్నారు... అలాగే కేంద్రం బడ్జెట్‌ లో ఏపీకి ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదని, హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటం చేయాల్సి ఉందని టీడీపీ నేతలతో అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: