హోదాకోసం జగన్ ఏప్రిల్ 6 వరకూ డెడ్ లైన్ పెడితే.. మార్చి 5 తర్వాత ఊహించని నిర్ణయాలు జరుగుతాయని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రాన్ని హెచ్చరించారు. మొత్తం మీద రాష్ర్ట ప్రయోజనాల కోసం రెండు ప్రధాన పార్టీలు.. కేంద్రంపై పోరాటాన్ని ఉధృతం చేశాయి. పనిలో పనిగా పొలిటికల్ మైలేజ్ కోసం వ్యూహాత్మక విమర్శలకు దిగుతున్నాయి. అయితే రాష్ర్ట ప్రయోజనాల కోసం కేంద్రంపై ఉమ్మడిగా పోరాటం చేయాల్సిన అధికార, విపక్షాలు సొంత అజెండాలతో పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయనేది విశ్లేషకుల వాదన. వైసీపీ ఎంపీల రాజీనామా అస్త్రం కూడా అలాంటిదే అనే విమర్శలూ వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద పొలిటికల్ హీట్ రాజేసిన అధికార, విపక్షం.. ఇదే హీట్ తో కేంద్రాన్ని నిలదీస్తాయా..? లేక ఇదంతా ఎన్నికల కోసం చేస్తున్న పొలిటికల్ స్టంటేనా?

Image result for ysrcp and tdp

ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై సమరశంఖం పూరించిన జగన్.. ఏప్రిల్ 6లోపు కేంద్రం హోదా ఇవ్వకుంటే.. వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించి వేడి రాజేశారు. టీడీపీ కూడా మార్చి 5లోపు కేంద్రం ఇస్తామన్నహామీలపై స్పష్టత ఇవ్వకుంటే.. వ్యూహాత్మకంగా పోరాటం చేస్తామని.. మార్చి 5 తర్వాత ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటామంటోంది. తాజాగా జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వస్తుందంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీతో కటీఫ్ చెప్పడమే ఆ కఠిన నిర్ణయం అయి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. మరోవైపు వైసీపీ కూడా ఇప్పటికే రాజీనామాలు చేస్తామని ప్రకటించింది.

Image result for ysrcp and tdp

రెండు పార్టీల పోరాటం కేంద్రంపైనే.. రెండు పార్టీల లక్ష్యం రాష్ర్ట ప్రయోజనాలను కాపాడడమే.. అయితే ఇక్కడే రెండు పార్టీల నేతలు ఒకరినొకరు దూషించుకుంటూ కేంద్రంపై పోరాటంలో పై చేయి తమదంటే తమదంటూ పొలిటికల్ మైలేజ్ కోసం తహతహలాడుతున్నాయి.. టీడీపీ వల్లే రాష్ర్టానికి ఈ గతి పట్టిందని.. చంద్రబాబుకు మోదీ ఫోబియా పట్టుకుందని అందుకే .. హోదాను తాకట్టుపెట్టారని వైసీపీ పదే పదే విమర్శలు చేస్తుంది. ఇప్పుడు కూడా అదే హోదా ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయిలో తీసుకెళ్లి.. కేంద్రంపై ఒత్తిడి పెంచడం ద్వారా.. ఇటు రాష్ర్టంలో అటు జాతీయ స్థాయిలో పార్టీ ఇమేజ్ పెరుగుతుందని భావిస్తున్నారు జగన్.

Image result for ysrcp mp

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగుందని ప్రశంసించి.. ఇప్పుడు హోదా కోసం అంటూ వైసీపీ డ్రామాలాడుతోందని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. జగన్‌కు దమ్ముంటే ఇప్పుడే ఎంపీలతో రాజీనామాలు చేయించాలని సవాల్ విసిరుతున్నారు టీడీపీ నేతలు.. ఏప్రిల్‌లో రాజీనామాలు చేస్తే ఆ తర్వాత ఉప ఎన్నికలు రావనే ఉద్దేశంతోనే జగన్ అలా చేస్తున్నారనేది వారి ఆలోచన. జగన్ కు ఉపఎన్నికను ఫేస్ చేసే దమ్ములేదనేది వారి విమర్శ. ఏడాది క్రితమే  ఎంపీలతో రాజీనామాలు చేయిస్తానన్న జగన్ ఎందుకు రాజీనామా చేయించలేదో ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు. ఏదైనా ఇష్యూ మీద రాజీనామా ఇస్తున్నట్టు ప్రకటిస్తే సాంకేతికంగా ఆ రాజీనామాలను ఆమోదించరు. అందుకే జగన్ ఈ నాటకం ఆడుతున్నారని చెప్తున్నారు.

Image result for ysrcp mp

మరోవైపు వైసీపీ రాజీనామాల అస్త్రం ప్రకటించినా.. అది ఎంతవరకూ నెరవేరుతుందనేది చూడాలి. ఎందుకంటే ఎంపీలు రాజీనామాలు చేయడం వల్ల బీజేపీ సర్కార్ కు వచ్చే నష్టమేం లేదు. రాజీనామాల వల్ల పదవీకాలం కోల్పోవడం మినహా ఒరిగేదేమీ ఉండదు. కనీసం రాజీనామాల వల్ల హోదా తీసుకురాగలరా అంటే అదీ అనుమానమే.! మేమూ పోరాటం చేశాం అని చెప్పుకోడానికి తప్పా రాష్ట్రానికి వీళ్ల రాజీనామాల వల్ల ఒరిగేదేమీ ఉండదు. ఇది మాత్రం పక్కా.! పోనీలే పాపం.. రాజీనామాలు చేశారని మోదీ ఫీలయ్యే ఛాన్స్ కూడాలేదు. ఇలాంటివన్నీ మోదీకి వెంట్రుకతో సమానం.. కాబట్టి రాజీనామాల అంశాన్ని వదిలేసి.. ఇంకో మార్గాన్ని ఎంచుకుంటే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: