టీడీపీ, జనసేనల దోస్తీ గురించి చెప్పనవసరంలేదు. పవన్ పార్టీ పెట్టిన మొదట్లో రాజకీయ అనుభవం గడించడానికి పోటీ చేయకుండా టీడీపీ కి మద్దతు తెలిపాడు. నిజానికి చెప్పాలంటే పవన్ వల్లనే గోదావరి జిల్లాలను టీడీపీ క్లీన్ స్వీప్  చేసిందని చెప్పవచ్చు. ఇక మద్దతు తెలిపాడు గనుక ఋణం తీర్చుకోకతప్పదు కాబట్టి అప్పట్లో పవన్ ఉద్దానం కిడ్నీ, గోదావరి ఫ్యాక్టరీ వంటి సమస్యలను లేవనెత్తగా హుటాహుటిన సమస్యలను పరిష్కరించాడు బాబు.


ప్రతీసారి ఎదో ఒక సమస్యను వెలుగులోకి తెచ్చి దాన్ని పరిష్కరించాలని అనడం అప్పటిలో టీడీపీ నేతలకు కోపం తెప్పించినట్లుంది. దీని విషయమయే పవన్ మీద బాహాటంగా విమర్శలు గుప్పించగా బాబు మాత్రం పవన్ ఏమి చేసినా, ఏది డిమాండ్ చేసినా విమర్శలు చేయకండి అని నేతలకు బోధచేసిన విషయం తెలిసిందే. కాగా ఈ సారి ఎన్నికలలో తాను ఎవరికి మద్దతు తెలుపబోతున్నాను అనే విషయం పవన్ ఇంకా వ్యక్తపరచలేదు. కానీ తను ఎప్పటికీ టీడీపీ మిత్రుడు అన్న విషయం బాబు చెప్పిన మాటలకి అర్థమవుతుంది.


కాగా నిన్న గురువారం అమరావతిలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో  భాగంగా ఆ పార్టీ  ముఖ్య నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్సులో పవన్ ప్రస్తావన కూడా వచ్చిందని సమాచారం. పవన్ పై నేతలు ఎటువంటి తొందరపాటు వాఖ్యలు చేయకూడదని, వ్యతిరేకంగా ఎవరూ విమర్శలు చేయవద్దని చంద్రబాబు ఆదేశించాడట. అవసరమైన సమయంలో పార్టీకి సహకరిస్తాడని బాబు చెప్పాడట. దీన్ని బట్టి చూస్తే పవన్, బాబు మళ్లీ కలిసి ఎన్నికల్లో దిగుతారని ఖాయమైనట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: