ఒకప్పుడు మంత్రగాళ్లు శక్తిని ప్రసన్నం చేసుకోవడానికి నరబలులు ఇచ్చేవారు..కానీ ఇప్పుడు అంతా టెక్నాలజీ యుగం.  ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతుంతో సెకన్లలో మన ముందు ప్రత్యక్షం అవుతున్న రోజులు..కానీ కొంత మంది మాత్రం ఇప్పటికీ దేవుడు ని ఎంతో గొప్పగా పూజిస్తారు..దెయ్యాలంటే భయపడి ఛస్తారు. సాధారణంగా బలిపూజలు, మంత్రాలు, మాయలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయనుకుంటారు..అటవీ ప్రాంతాల్లో కొన్ని తెగలు కూడా ఇలాంటి వాటిపై ఎక్కువ నమ్మకం చూపిస్తారు. 
మూసీలో పారేసిన చిన్నారి మొండెం
కానీ హైదరాబాద్ నగరంలో చట్టూ జనాలు ఉన్న ప్రాంతంలో ఓ మూర్ఖుడు చేసిన దారుణం చూస్తే..నిజంగా మనం సభ్యసమాజంలో బతుకుతున్నామా..లేక అడవిలో బతుకుతున్నామా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ మద్య ఉప్పల్ చిలుకానగర్ నరబలి కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. రాజశేఖర్ దంపతులు క్షుద్రపూజలో నగ్నంగా పాల్గొన్నారని పోలీసుల విచారణలో తేలింది. చిన్నారిని బోయిగూడ నుండి ఎత్తుకొచ్చి నరబలి ఇచ్చారని పోలీసులు తమ విచారణలో తేల్చారు.
నరబలిలో ముగ్గురు మహిళలు
చిన్నారి నరబలి కేసులో రాజశేఖర్‌ ప్రధాన సూత్రధారిగా పోలీసులు తేల్చారు. మొదట్లో తాను అమాయకుడినని..తనకు పిల్లలు ఉన్నారని..ఇలాంది దారుణం మేమెందుకు చేస్తామని..పోలీసులు తమను బలవంత పెట్టి మరీ ఈ నేరాన్ని ఒప్పకోమంటున్నారని రక రకాలుగా స్టేట్ మెంట్స్ ఇస్తూ వచ్చాడు రాజశేఖర్.   చంద్రగ్రహణం రోజున నరబలి చేస్తే అన్ని రకాలుగా మేలు జరుగుతోందని మంత్రగాడు ఇచ్చిన సలహతో రాజశేఖర్ చిన్నారిని బలి ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు.
నగ్నంగా రాజశేఖర్ దంపతుల పూజలు
మంత్రగాడి సలహతో రాజశేఖర్ దంపతులు నగ్నంగా క్షద్రపూజలో పాల్గొన్నారు. ఈ పూజలు చేయడం వల్ల ఆర్థిక, ఆరోగ్య సమ్యలు తీరుతాయని మంత్రగాడు చెప్పాడు. దీంతో రాజశేఖర్ దంపతులు ఈ మేరకు నగ్నంగానే పూజలో పాల్గొన్నారు.  నరబలి ఇచ్చిన తర్వాత మూసీలో చిన్నారి మొండెం పారేశారు. ఈ మేరకు పోలీసులు మూసీలో చిన్నారి బట్టలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. క్షుద్రపూజలను పూర్తి చేసిన తర్వాత మూసీలో జాగ్రత్తగా చిన్నారి మొండెన్ని పారేశారు.

మొత్తంగా ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. మొదటి ఈ కేసు మెకానిక్ నరహరిపై నెట్టాలని ప్రయత్నించారు..అందుకు తగ్గట్టుగా అమాయకంగా నటించిన రాజశేఖర్ ఎవరో వచ్చి తమ ఇంటిపై ఇలాంటి దారుణానికి వడిగట్టారని..తమను ఇరుకున పెట్టాలని చూసినట్లు మాట్లాడాడు. 

Image result for నరబలి హైదరాబాద్


మరింత సమాచారం తెలుసుకోండి: