తాజాగా జరిగిన టీడీపీ సమన్వయ సమావేశంలో చంద్రబాబునాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన “జేఎఫ్‌సీ” మిద సంచలనకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఏమన్నారంటే రాష్ట్రానికి కేంద్రం వలన అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన “జేఎఫ్‌సీ” వలన తెలుగుదేశం పార్టీకి నష్టం ఉండదని తేల్చిచెప్పారు చంద్రబాబు ఈ సమావేశంలో.


ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులతో పవన్ కళ్యాణ్ తో సున్నితంగా వ్యవహరించాలని సూచించారు చంద్రబాబు. అంతేకాకుండా “రాష్ట్రానికి మేలు చేయాలని పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేశారు. అయితే మొన్నటి పవన్ “జేఎఫ్‌సీ” లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు వివరాలకి శ్వేతపత్రం ఇవ్వాలని కోరారు. అయితే ఈ విషయంపై కూడా చంద్రబాబు స్పందించారు..నిధులకి సంభందించి శ్వేత పత్రం ఇవ్వాల్సింది కేంద్రమేనని రాష్ట్రం కాదని తెలిపారు చంద్రబాబు.


శ్వేత పత్రం విషయంలో కూడా నోరు జారవద్దని..అందరు సంయమనంతో సమాధానం చెప్పాలని చంద్రబాబు నేతలకి తెలిపారు. మొత్తం మిద పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికలలో టిడిపితో నే కలుస్తాడని మంచి ధీమా మిద ఉన్నాడు చంద్రబాబు. అయితే ఇదంతా గమనిస్తున్న రాజకీయ పండితులు పవన్ కళ్యాణ్ “జేఎఫ్‌సీ” కమిటీ అనేది చంద్రబాబునాయుడు ఆలోచన అని ఈ మొత్తం ఎన్నికలు వచ్చేసరికి మహాకూటమి అయి రాష్ట్రంలో బలపడుతున్న వైసిపి నేత జగన్ కి రానున్న ఎన్నికలలో పోటీగా నిలబడతాయని అంటున్నారు.


ఏదిఏమైనా ఎన్నికలు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలసి జగన్ మీద పోరాడటానికి ఎన్నికల బరిలోకి దిగుతారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోసారి జనాలు వీరిద్దరిని నమ్ముతారో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: