వైసిపి ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజా వచ్చే ఎన్నికలలో నగరి నియోజకవర్గంలో నిలబడే ఛాన్స్ లేవట. కారణం ఏమిటంటే ఈ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణించడంతో నగరి నియోజకవర్గ ప్రజలు అందరూ గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబం పట్ల సానుభూతి కనబరచటం.


దీంతో వచ్చేఎన్నికలలో వైసీపీ ఎమ్మెల్యే రోజాకి ఈ నియోజకవర్గం నుండి నిలబడితే కచ్చితంగా ఓడిపోయే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వైసిపి అధినేత జగన్ రోజని వేరే చోట నుండి పోటీ చేపించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గాలి ముద్దుకృష్ణమ నాయుడు గాలి కుమారుడు భాను ప్రకాష్ కు  ప్రజల్లో మంచి పేరే ఉంది.


భాను ప్రకాష్ కార్యకర్తలతో  చాలా సన్నిహితంగా ఉంటారు అని తెలుస్తుంది. అలాగే వివాదరహితుడు తన పని తాను చేసుకుంటూ సంయమనం తో సమాధానం చెప్తూ నగరి నియోజకవర్గ ప్రజలతో వ్యవహరిస్తారని మంచి పేరు ఉంది.


అయితే ఈ క్రమంలో వైసిపి అధినేత నగరి నియోజకవర్గం నుండి ఎవరో ఒకరు డమ్మి కాండిడేట్ ని పోటి లో పెడదాం అని జగన్ ఆలోచిస్తున్నారట. రోజాని కోనసీమ జిల్లాలో నుండి ఏదో ఒకచోట జగన్ నిలబెట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మొత్తం మిద వైసిపి నగరి నియోజకవర్గం మిద చేతులేతేసింది. అలాగే నగరి నియోజకవర్గంలో ఏ పార్టి గెలుస్తుందో ఆ పార్టి ఖచ్చితంగా అధికారంలో రాదు అని గత ఫలితాలు తెలియజేస్తూన్నయి. మరి ఈ సారి టిడిపి అధికారంలో వస్తుందో రాదో చూడాలి మరి.     

మరింత సమాచారం తెలుసుకోండి: