వైసీపీ అధినేత వైఎస్ జగన్ హీరోయిన్లతో ఎంజాయ్ చేసేవాడా.. బెంగళూరులో హీరోయిన్ తో ఎంజాయ్ చేస్తూ దొరికి్పోయాడా.. ఈ వ్యవహారమంతా మీడియాలో రాకుండా  ఓ మీడియా అధినేతతో జగన్ రాజీ కుదుర్చుకున్నాడా.. వినడానికే షాకింగ్ గా ఉంది కదూ.. కానీ ఇదంతా నిజమేనా.. లేక పుట్టించిన పుకార్లా.. అసలు విషయం తెలియదు కానీ.. ఓ టీడీపీ ఎమ్మెల్యే మాత్రం పైదంతా నిజమేనని బల్ల గుద్దుతున్నాడు.. 

jagan latest photos కోసం చిత్ర ఫలితం
ఎవరా ఎమ్మెల్యే అనుకుంటున్నారా.. ఆయన విశాఖ జిల్లా పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి.. ఇటీవల వైఎస్ జగన్ తన ఎంపీలతో ఏప్రిల్ ఆరున రాజీనామా చేయిస్తానని ప్రకటించడంతో ఆంధ్రాలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో తెలుగుదేశం, వైసీపీ మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతోంది. అందులో భాగంగానే విశాఖ ఎమ్మెల్యే ఈ స్థాయిలో జగన్ పై రెచ్చిపోయారు. తీవ్రస్థాయి ఆరోపణలు గుప్పించారు. 

jagan latest photos కోసం చిత్ర ఫలితం
ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు రాజకీయాలు చేసే సమయంలో జగన్ చిన్న పిల్లోడట. ఆ సమయంలో జగన్ బెంగళూరులోనో హీరోయిన్స్ తో విలాసాల్లో ఉండేవాడట. రాష్ట్రం కోసం కష్టపడుతున్న చంద్రబాబును  విమర్శంచే హక్కు వైఎస్ జగన్ కు లేదట..  అంతే కాదు.. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఫైటింగ్ స్టార్ట్ చేయ‌డంతో పాటు ఆయ‌న వేసిన క‌మిటీతో జ‌గ‌న్‌కు భ‌యం ప‌ట్టుకుంద‌ట. ఇదీ బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపణలు.. 


ఈ ఆరోపణలతో తేనె తుట్టె కదిలినట్టయింది. జగన్ కు నిజంగానే హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయా.. లేక ఏదో ఆవేశంలో టీడీపీ ఎమ్మెల్యే బురద జల్లాడా.. మరి దీనిపై వైసీపీ నేతలు ఏకంగా స్పందిస్తారో.. ఎలాంటి సమాధానం ఇస్తారో చూద్దాం..



మరింత సమాచారం తెలుసుకోండి: