ఏపీకి బడ్జెట్ అన్యాయం జరిగిందంటూ కొన్నాళ్లు టీడీపీ చేస్తున్న రాజకీయ పోరాటం ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. ఏప్రిల్ ఆరున ఎంపీలతో రాజీనామా చేయిస్తానని ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించడం రాజకీయ సంచలనాలకు దారి తీస్తోంది. జగన్ ప్రకటనతో టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది. ఎలా సమాధానం చెప్పాలా అని కిందా మీదా అవుతోంది. 

TDP MPS కోసం చిత్ర ఫలితం
ఈ సమయంలో వైఎస్ జగన్ ఇంకో బాంబు పేల్చారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన లోక్ సభ సభ్యులంతా ఒకేసారి రాజీనామా చేద్దామా అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఒక రాష్ట్రానికి చెందిన లోక్ సభ సభ్యులంతా రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా రాక ఏం చేస్తుందని ఆయన చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ట్విటర్ లోనూ కామెంట్లు చేశారు. అటు ప్రజా సంకల్ప యాత్రలోనూ ఈ సవాల్ విసిరారు. 

TDP MPS JAGAN కోసం చిత్ర ఫలితం
తమ పార్టీ ఎమ్.పిలు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కచ్చితంగా రాజీనామా చేస్తారని.. తెలుగుదేశం అదినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇందుకు తన పార్టీ ఎమ్.పిలతో రాజీనామా చేయించాలని వైఎస్ జగన్ అన్నారు. ఇంకా జగన్ ఏమన్నారంటే.. ఇది నిర్లిప్తంగా ఉండే సమయం కాదు.. రాష్ట్ర ప్రయోజనం కోసం అందరం కలసి ఓ నిర్ణయం తీసుకోవాలి.. ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతి ఎంపీ రాజీనామా చేయాలి..

TDP MPS కోసం చిత్ర ఫలితం
" చంద్రబాబు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయంలా మీ పార్టీ ఎంపీలతో కూడా రాజీనామా చేయిస్తారా? లేక ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెడతారా? అంటూ వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. మరి జగన్ సవాల్ కు టీడీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో..!



మరింత సమాచారం తెలుసుకోండి: