జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మొదటి నుంచి చంద్రబాబు అనుకూల వైఖరినే ప్రదర్శిస్తున్నాడు. ఈ విషయం అందిరకీ తెలిసిందే. 2014 ఎన్నికల్లోనూ ఆయన టీడీపీ గెలుపు కోసం ఎంతోకష్టపడ్డారు. పాపం వానల్లోనూ టీడీపీని గెలిపించాలంటూ సభల్లో ప్రసంగించాడు. ఎన్నికల తర్వాత కూడా పవన్ కల్యాణ్ చంద్రబాబు డైరెక్షన్ లోనే పని చేస్తున్నారన్న విమర్శలు చాలా వచ్చాయి. 

CHANDRABABU PAWAN KALYAN కోసం చిత్ర ఫలితం
ఐతే.. కొన్నిరోజులుగా పవన్ కల్యాణ్ తీరులో మార్పు వచ్చింది. ఆయన ఉన్నట్టుండి టీడీపీ పైనా విమర్శలు చేయడం ప్రారంభించారు. పూర్తిస్తాయి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన రోజు నుంచి ఈ మార్పు కనిపిస్తోంది. టీడీపీ పాలన అవినీతిమయమైందని విమర్శలు వస్తున్నాయని కూడా అన్నారు. ఈ కామెంట్లతో ఒక్కసారిగా కలకలం రేగింది. పవన్ కల్యాణ్ టీడీపీని టార్గెట్ గా పెట్టుకున్నారన్న విశ్లేషణలు వచ్చాయి. 

CHANDRABABU PAWAN KALYAN కోసం చిత్ర ఫలితం

దీనికితోడు పవన్ కల్యాణ్ ఉండవల్లితోనూ, జేపీతోనూ నిజనిర్దారణ కమిటీ ఏర్పాటు చేయడం కూడా టీడీపీ నేతలకు షాక్ ఇచ్చింది. ఈనేపథ్యంలో పవన్ పై టీడీపీ వ్యూహం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి మొదలైంది. కానీ పవన్ కల్యాణ్ పై టీడీపీది అనుకూలవైఖరేనని.. పవన్ తాజా ఎత్తుగడలు కూడా చంద్రబాబు డైరెక్షన్ లోనే జరుగుతున్నాయన్న అనుమానాలు తాజాగా కలుగుతున్నాయి.

CHANDRABABU PAWAN KALYAN కోసం చిత్ర ఫలితం

పవన్ కళ్యాణ్ జెఎసి తో ఇబ్బంది లేదంటూ చంద్రబాబు కామెంట్ చేయడం ఇందుకు బలం చేకూరుస్తోంది. పవన్ పోరాటంలో అర్థం ఉందన్న చంద్రబాబు..., రాష్ట్రానికి మేలు జరగాలనే కాంక్షతో తనకు తోచిన విధానంలో పవన్ వెళ్తున్నారని చంద్రబాబు అన్నారు. అంతే కాదు.. పవన్ శ్వేతపత్రాలు అడిగితే సున్నితమైన పద్దతిలో సమాదానం ఇవ్వండని టిడిపి నేతలకు ఆయన సూచించారు. అదీ సంగతి. 


మరింత సమాచారం తెలుసుకోండి: