బాలయ్య ఏంటి పవన్ మీద వాఖ్యలు ఏంటీ అని అనుకుంటున్నారా? అవును మీరు చదివింది నిజమే! అసలు పవన్ కల్యాణ్ అంటే ఎవరో నాకు తెలియదు అని వివాదాస్పద వాఖ్యలు చేశాడు. విశాఖపట్టణంలో ఒక ఈవెంట్ ను ముగించుకొని బయలుదేరుతుండగా విలేకర్లు అడిగిన ఒక ప్రశ్నకి సమాధానం చెప్పలేదు సరికదా అసలు పవన్ కల్యాణ్ ఎవరు అని అడిగి వాళ్ళకే దిమ్మదిరిగేలా షాక్ ఇచ్చాడు.


ఇక వివరాల్లోకెళితే నిన్న మహా శివరాత్రిని పురస్కరించుకుని కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి గారు విశాఖ బీచ్ లో ఒక  కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. దీనికి బాలయ్య కూడా హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత కారు ఎక్కి బయలుదేరుతున్న బాలయ్యను కొందరు విలేకరులు ప్రశ్నలు అడిగారు. అందులో ఒక విలేకరి "సార్! పవన్ కల్యాణ్ గారు" అని ప్రశ్న మొదలెట్టేలోపే ఆయన కల్పించుకొని "ఆయన ఎవరో నాకు తెలియదు " అని అక్కడనుండి జారుకున్నాడు.


బాలయ్య ఇలా అన్నాడో లేదో కొన్ని టీవీ  ఛానళ్ళు ఆయన అనిన క్లిప్ లను అరిగిపోయేంతవరకు ప్రసారం చేసాయి. ఇక పవన్ ఫాన్స్ మాత్రమే కాకుండా మిగితావాళ్లు కూడా బాలయ్య తీరుపై మండిపడుతున్నారు. 2014 ఎన్నికలలో టీడీపీ కి పవన్ మద్దతు కల్పించడంతో పాటు ఇద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు  కూడా! దానికంటే మించి ఒక అగ్రహీరో! మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని ఎవరో నాకు తెలియదు అని చెప్పి జారుకోవడం సభ్యత కాదు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: