ఎప్పుడైతే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టాడో అప్పటి నుండి రాష్ట్రములో ఆగ్రహజ్వాలలు వెలుగుతున్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచిన హామీలకు తూట్లుపొడుస్తూ ఈ బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఆంధ్రాకు తీరని అన్యాయం చేశారని ప్రజలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే ఛాన్స్ అన్నట్లుగా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలి అన్న అంశాన్ని తెరమీదకు తీసుకవచ్చి ఓటు బ్యాంకును కొల్లగొట్టాలనుకుంటున్నాయి.


ఇప్పటికే జగన్ ప్రత్యేకహోదాపై కేంద్రం ఏ విషయమైనది తేల్చకపోతే ఏప్రిల్ 6న తన ఎంపీలతో రాజీనామా చేయిస్తానని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక జనసేన అధినేత ఏకంగా రాష్ట్రంలో ఉన్న పార్టీలతో, మేధావులతో ఒక కమిటీని ఏర్పరచి హోదా ఎలా సాధించాలి అనే కార్యాచరణకు పూనుకున్నాడు. ఇప్పటికే సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ మరియు లోక్ సత్తా పార్టీ  అధినేత జయప్రకాశ్ నారాయణతో చర్చించి వారి మద్దతు కూడగట్టాడు. వైసీపీతో మొదటినుండి వ్యతిరేఖ స్వభావం ఉంది కాబట్టి వారిని మద్దతు అడిగే పరిస్థితిలేదు. టీడీపీ విషయానికొస్తే అది తన మిత్రపార్టీ కాబట్టి ఎప్పుడు మద్దతు అడిగినా ఇస్తారన్న నమ్మకం ఉంటుంది. ఇక మిగిలిన ఏకైక పార్టీ కాంగ్రెస్.


ఇప్పటికే రాష్ట్రంను విడగొట్టిన కాంగ్రెస్ మళ్లీ ఏపీలో కనిపించే దాఖలాలు లేకపోయినా పవన్ వారి మద్దతు కోరుతున్నాడు. ప్రత్యేక హోదా విషయంపైన చర్చించడానికి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి ఫోన్ చేస్తే  అది పవన్ నెంబర్ అని తెలిసికూడా రఘువీరా రెడ్డి  ఫోన్ ఎత్తలేదట. దీంతో పవన్ ఆయన భార్యకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పినా రఘువీరా నో అనేశాడంట. మళ్లీ పవన్ చేస్తే మాట్లాడాలని లేకున్నా తన గౌరవం పోతుందని మాట్లాడరంట. కానీ ప్రత్యేక హోదాపై  చర్చించను అని చెప్పి ఫోన్ కట్ చేసారంట. మళ్ళీ పవన్ ఫోన్ చేసి బలవంతం చేయగా మద్దతు ఇస్తాను తప్ప చర్చలకు రాను , కావలంటే పార్టీ ఉపాధ్యక్షుడు, కార్యదర్శిని  పంపుతాను అని ఫైనల్ చేసాడట. మరి ఇంత బ్రతిమిలాడి మద్దతు కూడగడుతున్న ఆశ నెరవేరిద్దో! లేదో !


మరింత సమాచారం తెలుసుకోండి: