పవన్ కళ్యాణ్ ఏమాత్రం నీతి నిజాయతి నిబద్ధత నియంత్రణ ప్రజలపై గౌరవమున్నా ఆయన ఇలా ప్రవర్తించకూడదు.  కారణం పవన్ కళ్యాణ్ లో ఈ ప్రాధమిక లక్షణాలు ఏమాత్రం లేకపోయినా ఆయన రాజకీయం - ప్రజలను ధారుణంగా మరోసారి మోసం చేయటమే ఔతుంది. ఈ విషయం ఉభయ రాష్ట్రాల ప్రజలు అర్ధం చేసుకోవాలి.  తనలో స్వార్ధం ఏ స్థాయిలో ఉందో, అది పరాకాష్టకు చేరి నింగిని తాకిందనటానికి తన కున్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో పలుకుబడి ఉపయోగించి తను నటించిన ఒక చెత్త సినిమా (అని తెలియబట్టే) కనీసం ఓపెనింగ్స్ అయినా రాబట్టుకోవాలనే తపనతో ప్రయత్నం చేసి తన రాజకీయ భాగస్వామి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నడూ ఆచారంలో లేని విధంగా వారం రోజుల పాటు రోజుకు ఏడు ఆటలు రాష్ట్ర మంతటా ఆడించుకొనే అవకాశం కల్పించారు.

Image result for pavan kalyan with chandrababu

అంటే 24 * 7 సినిమా ఆ వారం పాటు నడిచింది. ఇలా వేరే ఇతరుల సినిమాకు మన రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వెసులుబాటు  కలిపించిన దాఖలాలు చరిత్రలో ఉన్నట్లు కనపడదు. ఈ  ఏర్పాటు పవన్ కళ్యాణ్ కు మాత్రమే కల్పించటానికి కారణం ఆయన తన "రాజకీయ భాగస్వామి"  కావటం తప్ప వేరేమీ లేదు. తరవాత ఇదే వెసులుబాటు తన బావమరిది తన పార్టీ హిందూపురం శాసనసభ్యుడు నటించిన సినిమాకి ఇదే అలవరసలపై కు అనుమతి ఇచ్చాడు.

దీన్ని బట్టి చూస్తే బాబు పాలన సమస్తం తన మిత్ర బందు సపరివార ప్రయోజనార్ధమేనని ఋజువౌతుంది. ఇదే విషయం గౌతమీపుత్రశాతకర్ణికి వినోదపన్ను మినహాయించి రుద్రమదేవి సినిమాకి ఆ వెసులుబాటు ఇవ్వని నాడే జగద్విదితమైంది.

Image result for pavan kalyan with kcr

తన సినిమాలో పసలేదని, అది సాధారణంగా విడులైతే తనపంపిణీదాలు ఆత్మహత్య చేసుకోవటం తప్ప వేరేమార్గం లేదని  అని అర్ధమవ్వగానే ఓపెనింగ్స్ ద్వారానైనా కొంత ఉపద్రవాన్ని తప్పించటానికి చెత్త సినిమానికి సామూహికంగా తెలుగు ప్రజలకు చూపించారు అందులో వారి అభిమానులు కూడా ఉన్నారు.

అంటే ప్రజల్లోని ప్రేక్షకులను వరసలెంబటి తన సినిమాలు విడుదల చేయటం ఫెయిలవ్వటం జరిగినా ఇంకా జనం ఇతని అభిమానులుగా తిరగటం రానున్న కాలం - సాధారణ ప్రజలకు ఆవాస యోగ్యం కాదని ఋజువు చేస్తుంది.


Image result for agnathavasi

ప్రజలను మోసం చేయటానికి ఆఫ్ట్రాల్ ఒక చెత్త సినిమాని విడుదలలో చూపిన విన్యాసం నిజంగా ఆయన పవర్లోకి వస్తే చట్టా న్ని చుట్ట జుట్టి చెత్త బుట్టలో వేయడని గారంటీ లేదని నిర్ద్వంధంగా సంకోచం లేకుండా చెప్పవచ్చు.


ఈ "జె ఎఫ్ సి" వెనుక ఉన్న రాజకీయం అర్ధంచేసుకోవటానికి అంత కష్టపడనవసరం లేదు. తెలుగుదేశం అధినేత తనకుతానే తనపార్టీ సమన్వయ కమిటీలో "పవన్ మనవాడే - ఆయన్ని ఏమీ విమర్శించవద్ద" ని అనటంలోనే ఈ "జె ఎఫ్ సి"  నేపధ్యం ఎమిటో అర్ధంకాక పోతే మనల్ని "నోట్లోవేలెసుకుని చప్పరించే బాలుడు" అనే అంటారు. 


పవన్ JFC మీటింగ్ కు ఎవరెవరు వచ్చారో చూడండి..!

అయితే జె ఎఫ్ సి కి తరలి వచ్చిన వ్యక్తులెవరో పరిశీలించినా మనకు కొంత అవగాహన కలుగుతుంది. కమ్యూనిష్టు మిత్రులు, వారు గతకాలపు తెలుగుదేశం అనుయాయులే. వీరి మూలాలకు తెలుగుదేశం మూలాకు అతి స్వల్ప భెధం మాత్రమే ఉంది. దీని గురించి తెలియాలంటే ఖమ్మం విజయవాడ నగరాల్లోని సి పి ఐ-సి పి ఎం తీరుతెన్నులు చూస్తే పూర్తిగా అర్ధమౌతుంది.  "వారంతా ఒక తానులో ముక్కలే"  ఉండవల్లి, జెపి వీరిరువు రానున్న కాలంలో మాత్రం సమీప భవిష్యత్ లో పవన్ తో కలసి నందుకు చక్కని గుణపాఠం, అనుభవం రుచిచూడనున్నారని విఙ్జుల భావన. పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ జనసేన జన్మమే తెలుగుదేశం పార్టీ సంరక్షణ  కోసం, అని ఋజువవటానికి ఎంతోకాలం పట్టదు. ఈ విషయం  భవిష్యత్ లో తేలు తుంది. 


ప్రజారాజ్యం లోని యువరాజ్యం నేతగా ప్రజల్ని ముఖ్యంగా కాపుల్ని ముంచేసిన ఈ కొణిదల సోదరుల ఘన చరిత్ర సమస్తం తెలుగు జాతికి తెలిసిందే.  వీరి చరిత్ర తెలిసిన ఏపి ప్రజలు ఆయన్ని ఇంకా నమ్మితే కావాలనే "ఊబిలో దూకే వాళ్ళని ఎవరూ బాగుచేయ లేరు"  

మరింత సమాచారం తెలుసుకోండి: