పవన్ కళ్యాణ్ ను బీజెపి మరియు టీడిపి కరివేపాకులా తీసే పడేస్తుందా... పరిస్తితులును చూస్తుంటే అలానే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ జాయింట్ ఫాక్ట్ కమిటి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. విభజన సమయంలో కేంద్రం ఎలాంటి హామీలిచ్చింది ? ఎంతవరకు హామీలు అమలయ్యాయి ? ఇంకా ఎలాంటి హామీలు అమలు కావాల్సి ఉంది ? నిధులు ఎన్ని వచ్చాయి ? ఎంత ఖర్చయ్యాయి ? ఇతరత్రా అంశాలపై కమిటీ వేసిన ప‌వ‌న్ ఇందులో లోక్ సత్తా అధినేత జేపీ, రాజకీయ వేత్త ఉండవల్లితో పాటు ఇతర మేధావులు, నిపుణులుంటారని తెలిపారు.
Image result for pavan kalyan janasena
అయితే, ప‌వ‌న్ఓ వైపు వేగంగా ముందుకు సాగుతుంటే మ‌రోవైపు ఆయ‌న ఆలోచనకు తాజా,మాజీ మిత్ర‌ప‌క్షాలు షాక్ ఇచ్చాయ‌ని అంటున్నారు. అన్నీ ఇచ్చేశామ‌ని బీజేపీ చెప్తుండటం, అర‌కొర‌గా ఇచ్చారని టీడీపీ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో నిజాలు తేల్చేందుకు ఈ జేఎఫ్‌సీ ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. జేఎఫ్‌సీ ఏర్పాటు స‌మ‌యంలోనే కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన నిధుల వివరాలను టీడీపీ తనకు పంపించాలని కోరుకుంటున్నట్లు అలాగే రాష్ట్రానికి పంపించిన నిధుల వివరాలను బీజేపీ నేతలను కోరుతున్నట్లు ప‌వ‌న్‌ తెలిపారు.
Image result for pavan kalyan janasena
ఈ వివరాలను కమిటీకి పంపిస్తే…ఆ కమిటీ అధ్యయనం చేసి నిజాలు చెబుతుందన్నారు. అయితే పవ‌న్ పిలుపును ఆయ‌న ఒక‌నాటి మిత్ర‌ప‌క్షాలు లైట్ తీసుకున్నాయి. నిర్దేశిత డెడ్‌లైన్ పెట్టిన‌ప్ప‌టికీ…వివ‌రాలు ఇటు కేంద్రం కాని…అటు రాష్ట్రం కానీ మ‌రో వైపు అధికారంలో ఉన్న ప్రభుత్వం త‌ర‌ఫున కానీ వెలువ‌రించ‌లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌రిగే మొద‌టి స‌మావేశంలో ప‌వ‌న్ ఏం చేయ‌నున్నారనేది ఆస‌క్తిక‌రంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: