భారత దేశంలో ఇప్పటి వరకు నీటి కోసం రాష్ట్రాల మద్య ఎన్నో యుద్దాలు అయ్యాయి. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు మద్య కావేజీ జలాల కోసం ఎప్పటి నుంచో రగడ కొనసాగుతూనే ఉంది.  ఆ మద్య సీనీ ప్రముఖులు ఈ విషయంలో ఎంట్రీ ఇవ్వడంతో టాలీవుడ్, శాండిల్ వుడ్ ల మద్య కూడా గొడవ జరిగింది.  ఇదిలా ఉంటే..కర్నాటకకు మరిన్ని కావేరీ జలాలు దక్కాయి. గతంలో కేటాయించిన మొత్తానికి అదనంగా మరో 14.75 శతకోటి ఘనపుటడుగుల (టీఎంసీఎఫ్‌టీ) నీటిని వాడుకోవచ్చునని కర్నాటకకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దశాబ్దాలుగా సాగిన కావేరీ జల వివాదంపై తుదితీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించింది. 
Image result for కావేరీ జలాలు
2007లో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారం పొందవలసిన 192 టీఎంసీల నీటిలో 14.75 టీఎంసీల మేరకు తమిళనాడు ఇప్పుడు కోల్పోవలసి వస్తుంది. అయితే కావేరీ పరీవాహక ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో అదనంగా 10 టీఎంసీఎఫ్‌టీలను తమిళనాడు వాడుకునేందుకు అనుమతి ఇచ్చింది. గతంలో ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కర్నాటక 270 టీఎంసీఎఫ్‌టీల నీటిని పొందుతుండగా ఇప్పుడు అదనంగా 14.75 టీఎంసీఎఫ్‌టీలతో కలపి 284.75 టీఎంసీఎఫ్‌టీలను పొందుతుంది.   తమిళనాడుకు 419 టీఎంసీలు కేటాయించగా 277 టీఎంసీలు విడుదల చేశారు. మిగతా 192 టీఎంసీల నీటి విడుదలపై వివాదం చోటుచేసుకుంది.
Image result for కావేరీ జలాలు
ఇప్పుడు దానిని తగ్గిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.  చీఫ్ జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ అమితవ రాయ్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్‌లతో కూడిన ధర్మాసనం కావేరీ జల వివాదంపై తీర్పును గత సెప్టెంబర్ 20న రిజర్వ్ చేసింది. కాగా ఆ తీర్పును శుక్రవారం ప్రకటించింది. కాగా దీనిపై ఇప్పుడు తమిళనాడు ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు సీరియస్ అవుతున్నారు.  త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్న రజినీ, కమల్ హాసన్ లు మీడియా, ట్విట్స్ తో స్పందించారు. 
 
రజినీకాంత్ : 

Image result for కావేరీ జలాలు

కావేరీ నదీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రముఖ నటుడు రజనీకాంత్ స్పందించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఈ తీర్పు నిరాశపరిచిందని, దీని ప్రభావంతో   రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని, తమిళనాడు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.  ఈ తీర్పు పునఃపరిశీలన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని తన ట్వీట్ లో రజనీ కోరారు.  


కమల్ హాసన్ :

Image result for కావేరీ జలాలు

కావేరీ నదీ జలాల కేటాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో తమిళనాడుకు అన్యాయం జరిగిందని నటుడు కమల్‌ హాసన్‌ అన్నారు. రాష్ట్ర వాటాలో 15 టీఎంసీలు కోత పెట్టడం వల్ల తమిళ రైతులకు నష్టం జరుగుతుందన్నారు. కోర్టు తీర్పుపై తాను రాజకీయాలు చేయబోనని, ఎవరు చేసినా సహించబోనని అంటూనే తమిళనాడు వాటాను కచ్చితంగా విడుదల చేయాలని కమల్‌ డిమాండ్‌ చేయడం గమనార్హం. 



మరింత సమాచారం తెలుసుకోండి: