ఆంధ్రప్రదేశ్ అభివృద్దిపై ప్రేమా? స్వప్రయోజనాలపై మక్కువా? తెలుగుదేశం పార్టీకి ఏది ముఖ్యమో? అనేది అర్ధం చేసుకోవాలని బాజపా కోరుతుంది. ఇంతవరకు కేంద్రం ఎన్నో ప్రయోజనాల సాధనలో రాష్ట్రానికి సహకరించిందని తొలిసారిగా ఒక లిష్ట్ రూపంలో వ్యక్తీకరించింది.  తద్వారా తెలుగుదేశం పార్టీ తన వైఫల్యాలను ఇటు మిత్రపక్షమైన బిజెపి లేక అటు విపక్షమైన వైసిపిపై నెట్టివేయాలనే ప్రయత్నం విఙ్జులైన ప్రజలకు అర్ధమౌతూనే ఉంది. అసలు ప్రజల్లో అనుమానం టిడిపి తనవైఫల్యా లను కప్పిపుచ్చుకోవటానికే ఈ మద్య పవన్ కళ్యాణ్ సహాయంతో తాను నేపధ్యంలో ఉండి నాటకాలు వేయిస్తుందనే అనుమానం కలుగుతుంది.

Related image

రాష్ట్రాభివృద్ధి నిజంగా కోరే నిస్వార్ధ పరులు "పదేళ్ళ రాజధాని హైదరాబాద్" ను వదిలెయ్యటం - ప్రత్యేక హోదా సంజీవని కాదని కమీషణ్ల కక్కుర్తితో ప్రత్యేక పాకేజి అంది పుచ్చుకొంది. తరవాత నిదులు అందించే కేంద్ర ప్రభుత్వం గణాంకాలు కోరితే దానీపి తన పంచ మాంగ దళ్ళాలను పురికొల్పి రాష్ట్రం మొత్తాన్ని గందరగోళం లోకి నెట్టి వేయగా - ఇప్పుడు కళ్ళు తెరిచిన బిజెపి తన సమాధానాలతో బయటకు వస్తుంది.

Image result for capital amaravati in mahishmati format

బాబు సమయమంతా వైసిపి పతాకం కింద ఎన్నికైన శాసనసభ్యులను ంభ్యపెట్తి టిడిపి లోకి చేర్చుకోవటం అధినేత తన తనయుణ్ణి మంత్రి పదవిలో కూర్చోబెట్టటానికి ప్రాచార ఆర్భాటాలతో అమరావతి లో పలు దఫాలు శంఖుస్థాపనలకే వినియోగించారని. తెలంగాణాలో ఒక ఎమెల్సిని కొనబోయి బొక్కబోర్లాపడి అక్కణ్ణుంచి అమారావతి కి తన పార్టీ తన వందిమాగధులతో పలాయనం చిత్తగించారని ప్రజలందరికి తెలిసిన విషయమే.  

Image result for capital amaravati in mahishmati format

సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం లో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ టీడీపీ, వైకాపా నాయకులు చేస్తున్న ఆరోపణలు బీజేపీ నేతలు తోసి పుచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు, పార్టీ అధికార ప్రతినిధి జి వి ఎల్ నరసింహరావు శుక్రవారం న్యూడిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ ఈ విషయంలో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయని విమర్శించారు. 


Image result for chandrababu and his MPS

ప్రత్యేక హోదా పేరుతో ఎవరు రాజీనామాలు చేసినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని ప్రకటించారు. తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని ఇద్దరు నేతలూ హితవు చెప్పారు. కాంగ్రెస్ ఆంధ్రుల గొంతు కోస్తే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తోందని వారు స్పష్టం చేశారు. అలాంటిది తమనే విమర్శిస్తారా? అని హరిబాబు నరసింహారావు ప్రశ్నించారు. 

Image result for chandrababu and his MPS

నూతన రాజధాని అమరావతి నిర్మాణం గురించి మాట్లాడుతూ  "వీరు రాజధానిని నిర్మిస్తున్నారా? మయసభను నిర్మిస్తున్నారా?" అంటూ టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. "కొత్త రాజధానిలో ప్రభుత్వ భవనాలు నిర్మించటం కేంద్ర ప్రభుత్వం బాధ్యత. దీని కోసం రెండు న్నర వేల కోట్ల రూపాయలు ఇది వరకే విడుదలచేశారు. మరో వెయ్యి కోట్లు ఇవ్వవచ్చు" అని బీజేపీ నేతలు పేర్కొన్నారు. 
Image result for chandrababu and his MPS
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇంత వరకు ఇచ్చిన సంస్థలు, విడుదల చేసిన నిధులపై వారు 18 పేజీల పత్రాన్ని విడుదలు చేశారు. ప్రత్యేక హోదా సాకు గా చూపించి కేంద్రం ఎంత ఇచ్చినా పట్టించు కోకుండా సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని వారు ఆరోపించారు. "ప్రత్యేక హోదా ట్యాగ్" ఉంటే చాలు అనే విధంగా తెలుగుదేశం వ్యవహరిస్తోందని వారు దుయ్యబట్టారు.

Image result for haribabu gvl narasimharao

తమకు ప్రత్యేక హోదా చాలు, మిగతావి ఏవీ అవసరం లేదని తెలుగుదేశం పార్టీని చెప్పమనండి అంటూ జి వి ఎల్ నరసింహరావు మండి పడ్డారు. విభజన చట్టంలో లేని పలు ప్రాజెక్టులను కేంద్రం ఇచ్చినా ప్రత్యేక హోదా అంటూ నానా యాగీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ హోదా డ్రామా లు ఆడుతోందని కంభంపాటి విరుచుకుపడ్డారు. 

Image result for chandrababu and his MPS

ప్రత్యేక హోదా తో రాష్ట్రానికి రావలసినదంతా ప్రత్యేక సహాయం, ప్యాకేజీ రూపంలో కేంద్రం అందజేస్తోందని బీజేపీ నేతలు తెలిపారు. "ప్రత్యేక హోదా" సంజీవని ఏమీ కాదని పలుమార్లు ఘోషించిన చంద్రబాబు ఇప్పుడు చెత్తరాజకీయం కోసం స్వరంమార్చి ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఇరువురు నాయకులు దుయ్యబట్టారు. ఏడు జిల్లాలకు 30 సెప్టెంబర్ 2016 లో "సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సేస్" నోటిఫికేషన్ ద్వారా పన్ను రాయితీ కల్పించ లేదా? అని వారు ప్రశ్నించారు. తెలుగు దేశం, వైకాపా దీనికి జవాబు ఇవ్వగలవా? అని రావు నిలదీశారు. 

Image result for chandrababu and his MPS

పన్ను రాయితీలు వచ్చిన జిల్లాలకు ఈ రెండు పార్టీల ఎంపీలు, ఎంఎల్‌ఏ లు ఏ స్థాయిలో పెట్టుబడులు తీసుకురాగలిగారని వారు అడిగారు. ఏడు జిల్లాలకు ఇచ్చిన పన్ను రాయితీని వాడుకోవడంలో విఫలమైన వారు కేంద్రాన్ని ప్రశ్నించటం ఏమిటని వారు ఎద్దేవా చేశారు. "ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలు ఏ రాష్ట్రానికి కూడా సంజీవినిలా పని చేయవు. అన్ని సమస్యలను ఇవి పరిష్కరించవు. ప్రత్యేక హోదా వస్తే మనమిక పని చేయవలసిన అవసరం లేదనుకోవటం మూర్ఖత్వం అవుతుంది" అని వారు అభిప్రాయపడ్డారు.
Image result for chandrababu and his MPS 

ఎంపీలు, ఎంఎల్‌ఏలు తమ బాధ్యతను గుర్తెరిగి పని చేయాలి తప్ప కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేసినంత మాత్రాన ఫలితం ఉండదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వారు కేంద్రం నుంచి వచ్చిన దంతా హైదరాబాద్‌లో పెట్టి మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని, ఈ విషయంలో టీడీపీ, కాంగ్రెస్ తక్కువేమీ కాదని వారు విమర్శించారు. గతంలో అధికారం లో ఉన్న వారు చిత్తశుద్ధి తో పనిచేసి ఉంటే ఏపీకి ఈ గతి పట్టేది కాదని వారన్నారు. 

Image result for tdp ministers in modi cabinet

"రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని గతంలో మేమే వాదించాం. ఇప్పుడు అది సాధ్యం కావటం లేదు కాబట్టే ప్రత్యేక ఆర్థిక సహాయం చేస్తున్నాం" అని ఏపీ బీజేపీ నేతలు పేర్కొన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు రాజకీయ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది, కేంద్రం ఈ విషయంలో రాజకీయ నిర్ణయం తీసుకుంటుందని హరిబాబు చెప్పారు. దుగ్గిరాజపట్నం పోర్టు, కడప ఉక్కు కార్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని నివేదికలు వచ్చినా కేంద్రం వాటి స్థాపనకు కృషి చేస్తోందని హరిబాబు తెలిపారు. ఏడు లక్షల కోట్ల జాతీయ రహదారుల బడ్జెట్ లో ఒక లక్ష కోట్లు ఆంధ్ర ప్రదేశ్ లోని రహదారుల నిర్మాణానికి ఖర్చు పెడుతుంటే అది రాష్ట్ర అభివృద్దికి అమరావతి నగరానికి అద్భుత మార్గాలు వేసినట్లు కాదా? అని ప్రశ్నించారు. ప్రయోజనాలు అందించటానికి పది సంవత్సరాలు సమయం ఉన్నా చాలా ప్రయోజనాను ఇప్పటికే సమకూర్చగలిగా మన్నారు. 

Image result for haribabu gvl narasimharao

ఏ సంస్థగాని ప్రభుత్వం గాని ఒక ఉద్దేశం తో నిధులు సమకూర్చి అందజేసినప్పుడు ప్రయోజనం పొందినవారిని "ఎలా ఉపయోగించారో కొరే హక్కు - లెక్కలు చూపమనే హక్కు ఉంది" దాన్ని జయప్రకాష్ నారాయణ్ గారు కాదన్నంతమాత్రాన హక్కు అటకెక్కదు. "శ్వేత పత్రాలు అటుకేంద్రం నుండి ఇటు రాష్ట్రం" నుండి రాబట్టి దమ్ముంటే నిజం నిగ్గు తేల్చవలసిందే. నిజాయతీగా ఈ పని చేసి ఏ ప్రభుత్వం తప్పు చేస్తుందో తేల్చే బాధ్యత తీసుకున్న పవన్ కళ్యాణ్ రన ఋజువర్తన ఇప్పటికైనా ఋజువు చేసు కోవాలి. పక్షపాత రహితంగా వ్యవహరించటం ప్రజలకు అవసరం. 

Image result for haribabu gvl narasimharao

మరింత సమాచారం తెలుసుకోండి: