ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్థకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. భార్య, భర్త, పిల్లలు, పెద్దలు.. ఇలా అంతా కలిసిమెలసి ఉంటారు. కుటుంబాలకు విలువ ఇచ్చే సమాజం మనది. పిల్లల కోసం కోసమే అన్నీ సుఖాలు వదులుకుని జీవించే తల్లిదండ్రులు ఎందరో ఉంటారు. నిజంగా ఇది భారతీయ వ్యవస్థకు ఓ బలమైన పునాది. 

సంబంధిత చిత్రం
కానీ ఆ పునాది క్రమంగా బీటలు వారుతోందా.. పురుషుల నిర్లక్ష్యం కారణంగా సంసారాలు ఛిన్నాభిన్నమవుతున్నాయా.. పెరుగుతున్న సామాజిక మాధ్యమాల ప్రభావం కాపురాల్లో చిచ్చుపెడుతోందా.. అంటే అవుననే చెప్పాల్సి వస్తోంది. గతంలో భర్తలు నిర్లక్ష్యం చేసినా భార్యలు అలాగే పడి ఉండేవారు.. అంతకు మించి వేరే ఏమీ చేయడానికి వారికి అవకాశమూ ఉండేది కాదు. 

india illegal affairs కోసం చిత్ర ఫలితం
కానీ ఇప్పుడు ఇంటర్నెట్, సోషల్ మీడియాల పుణ్యమా అని ఇంటి నుంచే అందరినీ పలకరించే అవకాశం దొరికింది. ప్రపంచంలో ఏ మూలనున్నవారితోనైనా స్నేహం చేసే అవకాశం లభించింది. భర్తలచే నిర్లక్ష్యం చేయబడే భార్యలు ఇప్పుడు ఈ సోషల్ మీడియా పట్ల ఆకర్షితులవుతున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్ ల్లో కొత్త స్నేహితులతో కనెక్ట్ అవుతున్నారు. తమ పట్ల ఆసక్తి చూపించే మగవారితో స్నేహం పెంచుకుంటున్నారు. భర్తల నిర్లక్ష్యం కారణంగానే తాము ఇలాంటి స్నేహాలు చేస్తున్నామంటున్నారు.

సంబంధిత చిత్రం
కుటుంబం కోసం రోజంతా కష్టపడే మగాడు.. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో బిజీబిజీగా గడిపే మగాడు.. అదే కుటుంబంలోని మనుషులను నిర్లక్ష్యం చేస్తే.. అనుబంధాల కంటే డబ్బుకూ, కేరీర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతాయి. అందుకే ఎంత బిజీగా ఉన్నా భార్యా బిడ్డలకు తగిన సమయం కేటాయించకపోతే.. ఆ కుటుంబాల్లో మిగిలేది అశాంతి మాత్రమే. 



మరింత సమాచారం తెలుసుకోండి: