ప్రధానిగా మోడీ చరిష్మా రోజురోజుకూ తగ్గిపోతోంది.. ఆయన నిరంకుశత్వం కూడా రోజురోజుకూ పెరిగిపోతుంది. ఈ పెరుగుట అంతా విరుగట కొరకేనేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రధాని మోడీ వ్యవహారశైలి పట్ల సొంత పార్టీలోనూ అసంతృప్తి మేఘాలు కమ్ముకుంటున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల వెలువడిన ఓ సర్వే దక్షిణాదిలో మోడీ కంటే రాహులే బెటరని జనం ఫీలవుతున్నట్టు తేల్చింది. 

ADVANI MODI కోసం చిత్ర ఫలితం


దీనికితోడు మోడీ వ్యవహారశైలి కారణంగా మిత్రపక్షాలు కూడా దూరమవుతున్నాయి. ఇన్నాళ్లు నమ్మకంగా ఉన్న శివసేన, టీడీపీ వంటి పార్టీలు ఇప్పుడు బహిరంగంగానే మోడీని తిట్టిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందా..అన్న అనుమానం కలుగుతోంది. మరోసారి అధికారం నిలబెట్టుకోవాలంటే ప్రధానిగా మోడీని కాకుండా కాస్త సాఫ్ట్ గా ఉండే అద్వానీని తెరపైకి తెస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచన ఆ పార్టీ సీనియర్లలో కలుగుతోందని వార్తలు వస్తున్నాయి. 

ADVANI MODI కోసం చిత్ర ఫలితం

మోడీ కంటే ఎక్కువగా పార్టీలో అందరికీ ఆమోదయోగ్యమైన నేత అద్వానీ.. అలాగే అద్వానీ అంటే మిగిలిన రాజకీయ పక్షాలు సైతం ఓకే అంటూ మద్దతు ఇస్తాయి. కానీ ఇప్పటికిప్పుడు బీజేపీలో మోడీ పట్ల వ్యతిరేకత బయటపడుతుందా.. మనసుల్లో ఉన్నా మంత్రులు బయటపడతారా.. అద్వానీకి జై కొడతారా.. ఈ బాధ్యత అంతా ఎవరు తీసుకుంటారు అన్న ప్రశ్నలు తలెత్తడం సహజం. 

ADWANI CHANDRABABU కోసం చిత్ర ఫలితం


ఐతే.. ఇప్పటికే మోడీ చేతిలో దారుణంగా మోసపోయిన చంద్రబాబు.. మూడో ఫ్రంట్ ప్రయత్నాల్లో ఉన్నట్టు ఇప్పటికే నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్య కూడా మోడీ దెబ్బతోనే ఇష్టంలేకుండా ఆ పదవిలోకి వెళ్లాల్సి వచ్చింది. సో వీరంతా మోడీకి చెక్ చెప్పేందుకు తెరవెనుక ప్రయత్నాలు ప్రారంభించినట్టు వార్తలు వస్తున్నాయి. మరి మోడీకి చెక్ చెప్పడం అంత సులభంగా సాధ్యమవుతుందా.. అన్నది వేచి చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: