ఈరోజు కేసీఆర్ పుట్టిన రోజు.. ఈ విషయం ఉదయం పేపర్లు ముందు వేసుకోగానే తెలిసిపోయింది. ఏ పేపర్ చూసినా కేసీఆర్ కు శుభాకాంక్షలు చెబుతూ పెద్ద పెద్ద ఎడ్వర్ట్టైజ్ మెంట్లు కనిపించాయి. ఇక టీవీల్లోనూ ప్రకటనలు సరేసరి. అయితే ఈ అభినందనల్లో , శుభాకాంక్షల్లో హృదయం నుంచి వచ్చేవి కొన్నైతే.. మెహర్బానీ కోసం వచ్చేవే ఎక్కువగా ఉంటాయి. 


అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని మెప్పుపొందేందుకు ఎక్కువగా పార్టీ నాయకులు, కాంట్రాక్టర్లు, కంపెనీలు ఇలాంటి యాడ్స్ భారీగా ఇస్తుంటాయి. కానీ అసలైన అభిమానం ఉన్నవారు మాత్రం దాన్ని విభిన్నంగా ప్రదర్సిస్తారు. హైదరాబాద్ హస్తినాపురంనకు చెందిన విద్యాధర్‌ అదే పని చేశాడు. ఆయన కేసీఆర్ కు ఓ అద్భుతమై గిఫ్ట్ పంపాడు. అదేంటో తెలిస్తే షాకవుతారు. 

సంబంధిత చిత్రం
ఆయన కేసీఆర్ కు బంగారు విగ్రహం పంపారు. అది కూడా కేసీఆర్ విగ్రహమే.. అబ్బో చాలా ఖర్చయి ఉంటుంది అనుకుంటున్నారా.. అబ్బే అదేం కాదు. ఎదుకంటే ఆ విగ్రహం ఎంత చిన్నదంటే.. దాని తయారీకి కేవలం కేవలం 14 మిల్లీగ్రాములు మాత్రమే పట్టింది. ఆ విగ్రహం సూది రంధ్రంలో ఇమిడిపోతుంది. అంత చిన్నదన్నమాట. ఈ బుల్లి విగ్రహాన్ని చేసేందుకు విద్యాధర్ వారం రోజులు కష్టపడ్డాడు. 

సంబంధిత చిత్రం
ఈ విద్యాధర్‌ గతంలో తల వెంట్రుకపై ‘జై కేసీఆర్‌... జై తెలంగాణ’ అని కూడా రాశాడు. దాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా ఇచ్చారు. ఈ పుట్టినరోజు కోసం ఇలా బుల్లి విగ్రహంతో అభిమానం చాటుకున్నాడు. గ్రేట్ కదూ. 



మరింత సమాచారం తెలుసుకోండి: