సోము వీర్రాజు వాదనలకు చెక్ పెట్టవలసిన అవసరం టిడిపి ప్రభుత్వానికి ఉంది. కారణం ఆయన ఇచ్చిన వివరాలు తప్పా ఒప్పా అనే నిజనిర్ధారణ ప్రజలకు అవసరం. ఇది టీడిపి బాధ్యత కూడా. ముఖ్యమంత్రితో పాటు, టీడీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి వివరాలతో దాడి చేశారు. అలా విరుచుకుపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ₹16000 కోట్లు ఇచ్చిందని, ఆ నిధులను ఏం చేశారో లేకపోతే ఎలా వినియోగించారో చెప్పాలని ఆయన చేసిన డిమాండ్‌ కు సమాధానం చెప్ప వలసిందే. 

Image result for somu veerraju about 16000 crores account

కేంద్రం ఇవ్వాల్సిందంతా ఇచ్చేసిందని, ఇంకేం బాకీ ఉన్నామో? ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేయవలసిన దానికంటే ఎక్కువే సాయం చేసిందని, అడిగిన దాని కంటే ఎక్కువే ఇచ్చిందని, సంతృప్తిగా ఉన్నామని గతంలో చాలాసార్లు ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో తాము ఎదుగుతామని టీడీపీకి భయం పట్టుకుందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఇందులో నిజమెంత అనేది వివరించాల్సిన బాధ్యత ముఖ్య మంత్రిదే. కారణం ఆరోపణ ఆయన ముఖ్యమంత్రిపైనే చేశారు కదా! మౌనం అంగీకారం అనేది ప్రజలు భావిస్తారు. సమాధానం ఉంటే ఆలోచిస్తారు.

Image result for somu veerraju about 16000 crores account

రాష్ట్ర విభజన చట్టం పూర్తి అమలుకు 2022 వరకు సమయం ఉందని, ఇప్పటి నుంచే ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు కదా! అన్నారు. ఈ నాలుగేళ్లలో 60 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రానికి ₹16000 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. ఆ మొత్తాన్ని రైతు రుణమాఫీ పేరుతో ఖర్చుచేసి, అభివృద్ధిని పక్కన పెట్టారని మండి పడ్డారు. ఇది నిజమేనా అంటున్నారు తెలుగు ప్రజలు. వెనుక బడిన జిల్లాలకి ₹1050 కోట్లు పారిశ్రామిక రాయితీ కేటాయించామని, అయితే వాటిని ఒక్క పరిశ్రమకైనా ఆ నిధులు కేటాయించారా? అని ప్రశ్నించారు. దీనికి కూడా సిఎం సమాధానం చెప్పి అది యదార్ధం కాకపోతే బాలన్స్ కేంద్రాన్ని అడిగే అవకాశం ఉంది కదా!

బిజెపి ని ఇన్ని అడుగుతున్న బృందం,  ముఖ్యమంత్రిని సోము కూడా ఒక ఒక ప్రశ్న వేశారు "గత ఎన్నికల సమయంలో టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిని ఒక్కటైనా అమలు చేశారా?"  అని. ప్రజల తరపున సోము వీర్రాజు సూటిగా ప్రశ్నించారు.  నిరుద్యోగ భృతి, రైతు రుణ మాఫీ జరిగిందా అని అడిగారు. టీడీపీ మీడీయా ద్వారా రాష్ట్ర ప్రజల ముందు జీజేపీని దోషిని చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతోందని టీడీపీకి భయం పట్టుకుందని ఆయన వ్యాఖ్యలు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: