ఒకప్పుడు రాయలసీమ అంటే రతనాల సీమ అనేవారు..కానీ కొంత కాలంగా రాయలసీమలో కరువు తాండవం చేస్తుంది. అంతే కాదు రాయలసీమ అంటే కేరాఫ్ ఫ్యాక్షన్ అన్న ముద్ర పడింది.   కానీ ఇప్పుడు దాన్ని అభివృద్దికి పట్టుగొమ్మగా మారుస్తున్నారు చంద్రబాబు.  వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామికీకరణ చేస్తే అభివృద్ది పథంలో ముందుకు నడిపించవొచ్చని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకున్నదే తడవు కొత్త కొత్త పథకాలు తీసుకు వస్తూ..రాయలసీమ ముఖచిత్రం మార్చబోతున్నారు. నీళ్లు లేకున్నా పంటలు లేకున్నా.. ఉన్న వనరులుతోనే అద్భుతాలు సాధిస్తున్నారాయన.
Image result for రాయలసీమ పరిశ్రమలు
ఇప్పటికే కియా వంటి అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ తమ పరిశ్రమలు స్థాపించాయి. ప్పుడు మరెన్నో కంపెనీలు ముందుకు వస్తున్నాయి.ఇక అనంతపురము జిల్లా పాలసముద్రంలో 2 ఎకరాల విస్తీర్ణంలో 20 కోట్లతో సాయిదివ్య అపెరల్స్ అండ్ ఫ్యాషన్స్ పరిశ్రమ ఏర్పాటు కాబోతోంది. ఇది ఈ ఏడాది మార్చి నాటికి ప్రొడక్షన్ స్టార్ చేస్తుందట. ఇక్కడ 2000 మందికి జాబ్స్ వస్తాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో ‘నాచు కార్పొరేషన్ స్టీల్ ఇండస్ట్రీస్’ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ డీఐ పైప్ తయారీ పరిశ్రమ కూడా రాబోతోంది. దీని పెట్టుబడి ఎంతో తెలుసా.. వెయ్యి కోట్లు. ఇవే కాకుండా.. శ్రీసిటీలో లెర్రీస్ సోలార్ టెక్నాలజీ సంస్థ సోలార్ సెల్స్, మాడ్యుళ్లను తయారు చేసే యూనిట్‌ను 1500 కోట్లతో పెట్టబోతోంది. 
Image result for రాయలసీమ పరిశ్రమలు
చిత్తూరు జిల్లాలో 150 ఎకరాలలో రూ.400 కోట్ల పెట్టుబడులతో అరవింద్ ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్స్ అండ్ గార్మెంటింగ్ యూనిట్‌ను నెలకొల్పుతున్నారు. దీని ద్వారా ఏటా 1000 కోట్ల ఎగుమతులు చేయగలదని అంచనా వేస్తున్నారు. ఈ పరిశ్రమ స్థాపనతో గార్మెంటింగ్ పరిశ్రమలో 8000 మందికి, టెక్స్‌టైల్స్‌లో 7వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు వచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు.  ఎల్ఈడీ టీవీలు, వాషింగు మిషన్లు, ఎల్ఈడీ లైట్లను తయారీ కేంద్రం ప్రారంభించబోతోంది. పెట్టుబడి 150 కోట్లు.. ఉద్యోగాలు.. 1500. ఇలా చెప్పుకుండా పోతే సీమ సీన్ మార్చే పరిశ్రమలు చాలానే ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: