సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారా.. తాను చాలా తెలివిగా వ్యవహరిస్తున్నానని భావించే వర్మకు మొదటి సారిగా షాక్ తగలబోతోందా.. భారతీయ చట్టాల కు వ్యతిరేకంగా జీఎస్సీ అనే పోర్న్ సినిమాను తీసినందుకు ఆయన జైలు ఊచలు లెక్కపెట్టబోతున్నారా.. అంటే అవుననే అనిపిస్తోంది. వర్మకు నోటీసులిచ్చిన సీసీ ఎస్ పోలీసులు దాదాపు మూడు గంటల పాటు విచారించారు.

varma ccs police కోసం చిత్ర ఫలితం
అసలు కేసు ఏమిటంటే.. రామ్‌ గోపాల్‌ వర్మ జీఎస్టీ పేరుతో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ పేరుతో వెబ్‌ సిరీస్‌ తీశారు. దాని ప్రమోషన్ లో భాగంగా  ఓ టీవీ ఛానెల్లో మహిళలను కించపరిచేలా మాట్లాడారు. ఓ సామాజిక కార్యకర్తను నిన్ను హీరోయిన్ గా పెట్టి పోర్న్ సినిమా చేస్తానని వెటకారంగా మాట్లాడారు. దీంతో మండిపడ్డ మహిళా సంఘాలు వర్మపై కేసుపెట్టాయి. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణకు రావాలంటూ వర్మకు నోటీసులు జారీ చేశారు.

సంబంధిత చిత్రం
పోలీసుల నోటీసులకు షూటింగ్‌లో బిజీగా ఉన్నానంటూ రెండుసార్లు వాయిదా వేసిన వర్మ శనివారం సైబర్‌ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యారు. పోలీసులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించడమే కాకుండా ఆయన లాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. పోర్న్ సినిమాలు విదేశాల్లో తీయడం అక్కడి చట్టాల ప్రకారం సమ్మతమే.. కానీ ఇండియాలో అనుమతి లేదు. ప్రదర్శనకు కూడా అనుమతి లేదు. 

varma ccs police కోసం చిత్ర ఫలితం
ఐతే.. వర్మ అమెరికాకు వెళ్లాడా? లేదా?.. ఎవరెవరితో మాట్లాడాడు.. వంటి విషయాలు తెలుసుకునేందుకు లాప్ టాప్ సహకరించవచ్చు. ఆ లాప్ టాప్ లో సంచలన విషయాలు ఏమైనా బయటపడితే వర్మకు జైలు జీవితం ఖాయం కావచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో.. 



మరింత సమాచారం తెలుసుకోండి: