సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మేధావిగా పేరుంది. నలుగురికీ నచ్చినది నాకసలే నచ్చదురో అనే టైపు..  ఆయనంతే అదో రకం.. అని చాలామంది అనుకునేలా రామ్ గోపాల్ వర్మ ప్రవర్తిస్తుంటారు. నాకు నచ్చిందే నేను చేస్తా.. లోకంతో నాకు పని లేదు అనే టైప్ రామ్ గోపాల్ వర్మది. ఈ ప్రవర్తనే ఆయనంటే ఓ రకం క్రేజ్ తీసుకొచ్చింది కూడా.. కానీ జీఎస్టీ అనే పోర్న్ సినిమా ప్రమోషన్ ఆయన్ను చిక్కుల్లో పడేసింది. 

ram gopla varma mia కోసం చిత్ర ఫలితం
జీఎస్టీ సినిమా ప్రమోషన్ కోసం ఓ టీవీ ఛానెల్లో వర్మ లైవ్ కు వచ్చారు. విశాఖకు చెందిన ఓ మహిళా లీడర్ మణి గురించి ఆయన అవమానకంగా మాట్లాడారు. సామాజిక కార్యకర్త అయిన మణిను హీరోయిన్ గా పెట్టి పోర్న్ సినిమా చేస్తానని కామెంట్ చేశారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న మహిళా సంఘాలు వర్మపై కేసుపెట్టాయి. ఈ నేపథ్యంలో వర్మను శనివారం సీసీఎస్ పోలీసులు విచారించారు. 


ఈనేపథ్యంలో మరోసారి వర్మ ఓ చానల్ లో లైవ్ లోకి వచ్చారు. పోలీసు కేసులతో ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో ఏమో.. ఎప్పుడూ ఎవరికీ తలవంచని వర్మ.. చానల్‌ లైవ్ ప్రోగ్రామ్ లోనే దేవి, మణిలకు సారీ చెప్పారు. అప్పుడు ఎమోషన్‌లో భాగంగానే అలా అన్నానని, అందుకు క్షమాపణ చెబుతున్నానని అన్నారు. తనకు మహిళా సంఘం నేతలంటే తనకు అపార గౌరవం ఉందన్నారు.

ram gopla varma gst tv9 live కోసం చిత్ర ఫలితం

ఇక్కడే ఇంకో ట్విస్ట్ వచ్చింది. వర్మ సారీ చెప్పినా మహిళాసంఘాలు విడిచిపెట్టలేదు. వర్మ సారీని ఐద్వా నేత మణి స్వీకరించడం లేదని లైవ్ లోనే చెప్పేసింది. రామ్ గోపాల్ వర్మ ఆరోజు  చాలా దిగజారి మాట్లాడారని.. అలాంటి వ్యక్తి చెప్పిన సారీ తనకు వద్దని మొహం మీదే చెప్పేశారు. చట్టప్రకారం ఆయనకు శిక్ష పడాల్సిందేనని పంతంపట్టారు. పాపం వర్మ ఇంకేం చేయలేక.. సరే.. కేసును ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నానన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: