కేంద్ర మాజీ మంత్రి జైరామ్‌ రమేశ్‌పై ఏపీ ఆర్థిక మంత్రి యనమల మండిపడ్డారు. జైరామ్‌ రమేశ్‌ తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు.  ఏపీ విభజన చట్టాన్ని అడ్డగోలుగా రూపొందించి ఆంధ్రప్రదేశ్ గొంతుకోసిన అప్పటి కేంద్రమంత్రి జైరామ్ రమేశ్ పై ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. చేసిన నిర్వాకం చాలక ఇప్పుడు పోలవరం విషయంలో అవాకులు చవాకులు పేలుతున్న జైరామ్ రమేశ్ తీరుపై యనమల చాలా ఘాటుగా స్పందించారు. రాష్ట్ర విభజనలో జైరామ్‌ రమేశ్‌ ఆడిన డ్రామాలు ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. టీడీపీని విమర్శించే హక్కు జైరామ్‌ రమేశ్‌కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Image result for polavaram
 ఆంధ్రులను అవహేళన చేయడం జైరామ్‌ రమేశ్‌ మానుకోవాలన్నారు. రెండు సార్లు రాజ్యసభకు పంపిన రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు.  అడ్డగోలు విభజన సమయంలో ఏపీ కి జరుగుతున్న అన్యాయం పై ఒక్క మాట కూడా మాట్లాడకుండా అన్యాయం చేశారని ఆరోపించారు.  కాంగ్రెస్ పార్టీ విభజన సమయంలో డ్రామాలు ఆడినందువల్లే రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ కు ప్రజలు బుద్ది చెప్పారని యనమల ఎద్దేవా చేశారు.
Image result for ja ram ramesh
ఏపీ నుంచి జైరామ్ రమేశ్ రెండుసార్లు రాజ్యసభకు వెళ్లారని.. కనీసం ఆ కృతజ్ఞత లేకుండా రమేష్ ఏపీకి తీరని అన్యాయం చేశారని యనమల గుర్తు చేసుకున్నారు. రాష్ట్రానికి న్యాయం చేయమని టిడిపి ఎంపీలు పార్లమెంటులో పోరాడుతుంటే కాంగ్రెస్ నేతలు కనీసం పెదవి విప్పలేదని యనమల కాంగ్రెస్ ఎంపీల తీరును ఎండగట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: