తెలుగు రాష్ట్రాల్లో ఆమ్రపాలి పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పడిన వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు తొలి కలెక్టర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇక అప్పటినుండి ఎనర్జిటిక్‌, డైనమిక్‌ కలెక్టర్‌గా పేరు సంపాదించారు. జనవరి నెల చివరలో ఐపీఎస్‌ అధికారి సమీర్‌ శర్మను ప్రేమవివాహం చేసుకొన్నబోతున్నట్లు  వార్తలు వచ్చాయి. 


వివాహ  నేపథ్యంలోనే  ఆమె ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు లాంగ్ లీవ్ కు దరఖాస్తు చేసుకోగా ఈ మేరకు 21 రోజులు సెలవు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రస్తుతం ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. తన చెల్లెలితో కలిసి తీసుకున్న ఒక ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. సాంప్రదాయ దుస్తుల్లో  ఆమె ముస్తాబయ్యారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాలవారు, సన్నిహితులు హాజరయ్యారు.


పెళ్లి తర్వాత ఈ నెల 22న వరంగల్ లో, 25న హైదరాబాద్‌లో సన్నిహితులకు గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నారు. రెండు  తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించేందుకు ఇప్పటికే హోటల్స్ బుకింగ్స్ కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఇక పెళ్లయిన తరువాత దంపతులిద్దరూ టర్కీ దేశ పర్యటనకు  వెళ్లనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: