ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఐదుగురి కేంద్ర మంత్రులను పిలిచి క్లాస్ పీకార‌ట‌. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల బట్టి అన్నారో లేక‌, ఏపీకి అన్యాయం జ‌రుగుతోంద‌నే భావ‌న‌తో అన్నారో ఎవరికి అర్థం కావటం లేదు. అయితే ఈ క్రమంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సంబంధిత కేంద్ర మంత్రులకు మీ మి శాఖలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏవిధంగా సాయం చేయగలరో అన్ని విధాలా ఆలోచించి చేయండి అంటూ ఆదేశించారట కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ.


ప్రస్తుతం ఏపీలో ఇప్పుడు అసాధార‌ణ ప‌రిస్థితులు ఉన్నాయి. ఏపీ ప్ర‌జ‌లు రగిలిపోతున్నారు. తాము కోరుకోని విభ‌జ‌న‌ను త‌మ‌పై రుద్దిన కేంద్రంపై అక్క‌డి ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. నిన్న కాంగ్రెస్ ఏపీని విభ‌జించి అన్యాయం చేసింది. నేడు బీజేపీ ఏపీకి నిధులు కేటాయించ‌కుండా వారిని ఎద‌గ‌నీయ‌కుండా చేతులు క‌ట్టేసి అన్యాయం చేస్తోంది. ఏపీకి రెండు జాతీయ పార్టీలు అన్యాయం చేశాయి. బీజేపీ, కాంగ్రెస్ క‌లిసే విభ‌జ‌న చేశాయి.


దీంతో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఆ బురద బిజెపి పార్టీ మీద పడకుండా రాబోయే ఎన్నికల్లో దిద్దుబాటు చర్యలు గా ప్రస్తుత కేంద్ర మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది.


అయితే ఈసారి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోరని …….గత ఎన్నికల వేళ మోడీ తిరుపతి వెంకన్న సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి తర్వాత మాట మార్చిన నేపథ్యంలో అంతేకాకుండా విభజన ప్రధాన హామీలను బిజెపి పార్టీ తుంగలో తొక్కడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బిజెపి పార్టీ అంటేనే అసహ్యించుకుంటు న్నరు అని అన్నారు రాజకీయ విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: