ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబునాయుడు మీద అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో బొత్స సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంతో అవసరం అని అన్నారు.


ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించినా సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చుకో లేని స్థితిలో ఉన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని ధ్వజమెత్తారు బొత్స సత్యనారాయణ. ఈ విషయంలో బిజెపి పార్టీతో టిడిపి కలిసిపోయి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు బొత్స సత్యనారాయణ.


ఈ సందర్భంగా వైయస్ఆర్ సీపీ పార్టీ ప్రత్యేక హోదా కోసం చేస్తున్నా పోరాటంలో చంద్రబాబునాయుడు కలిసి రావాలని కోరారు బొత్ససత్యనారాయణ. మరియు అదే విధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు బొత్ససత్యనారాయణ.


గత ఎన్నికలలో బిజెపి టిడిపి పార్టీ తరపున ప్రచార సభలో పాల్గొని పవన్ కళ్యాణ్ టిడిపి బిజెపి పార్టీలు పనిచేయక పోతే నన్ను అడగండి వారి కాలర్ పట్టుకుని అడుగుతాను అని ఆనాడు చెప్పారు….అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీ పక్కన బెడితే టీడీపీ కాళ్లకింద ఉన్నాడని అన్నారు బొత్స సత్యనారాయణ. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ప్రస్తుత వ్యవహారశైలి తెలుగుదేశం పార్టీ కాపాడటానికి అని అన్నారు బొత్స సత్యనారాయణ.



మరింత సమాచారం తెలుసుకోండి: