విపక్షనేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రకాశం జిల్లాకు చేరింది. ఈ జిల్లాలో ఎంటర్ అవుతూనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీనీ, పవన్ కల్యాణ్ నూ కడిగి పారేశారు. ఇటీవల పవన్ కల్యాణ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అంటూ ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఉండవల్లి అరుణ్ కుమార్, జేపీ వంటి మేథావులను కూడా చేర్చుకున్నాడు. ఈ కమిటీపై జగన్ మండిపడ్డారు.  

JAGAN YATRA IN PRAKSAM కోసం చిత్ర ఫలితం
చంద్రబాబు తానా అంటే ... ఆయనకు తందానా చెప్పే దానికే పవన్‌కల్యాణ్‌ ఉన్నారని విరుచుకుపడ్డారు. పవన్ జాయింట్‌ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ పేరుతో ఓ కమిటీ ఏర్పాటు చేసి,  కేంద్ర ప్రభుత్వం ఎంతిచ్చిందీ... రాష్ట్ర ప్రభుత్వం ఎంత తీసుకుందీ  నిజనిర్థారణ చేస్తారట.. అంటూ ఎద్దేవా చేశారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో ఉంటున్న చంద్రబాబే రాష్ట్రానికి బీజేపీ వాళ్లు దండిగా ఇచ్చారని నాలుగేళ్లుగా చెబుతూ వచ్చారు...  ఇపుడు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ప్లేటు మార్చి, డ్రామాలాడుతూ  మళ్లీ ఆయనే కేంద్రం ఏమీ ఇవ్వలేదని చెప్పడం చూస్తూంటే నాకు నిజంగా ఆశ్చర్యం కలుగుతోందన్నారు జగన్.. 


సాక్షాత్తూ చంద్రబాబే కేంద్రం బ్రహ్మాండంగా ఇచ్చిందని చెబుతుంటే.. ఇంకా పవన్‌కల్యాణ్‌ అనే వ్యక్తి వాళ్లు ఏమిచ్చారు? వీళ్లేమి తీసుకున్నారు? అని ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీని వేసి ఏం చేస్తాడని నిలదీశారు. నిజంగా ఇది కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లుగా ఉందంటూ జగన్ పవన్ కల్యాణ్ పరువు తీసేశారు. చంద్రబాబుకు, పవన్‌కల్యాణ్‌కు నేనొక్కటే చెబుతున్నా... ఇలా కోడిగుడ్డు మీద ఈకలు పీకడం కాదు, రూపాయి, అర్ధ రూపాయి తక్కువ ఇచ్చారని నానా యాగీ చేయడం కానే కాదు, మీరు చేయాల్సిందల్లా.... ప్రత్యేక హోదా మా హక్కు అని పోరాటం చేయడమేనని సవాల్ చేశారు జగన్. 



మరింత సమాచారం తెలుసుకోండి: