ఇంకో కొన్ని నెలల్లో దేశం మొత్తం ఎన్నికల హంగామా నెలకొనబోతోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల రాజకీయనాయకులు అందుకు తగ్గట్లుగానే కసరత్తులు కూడా మొదలుపెట్టేసారు. కానీ అంధ్రప్రదేశ్లో  మాత్రం అన్ని పార్టీలు ఒకే విషయంపైన ఓట్లు అడగటానికి రెడీ అయిపోయారు. ప్రత్యేకహోదా మరియు బడ్జెట్ ల విషయంలొ కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయం అన్ని రాజకీయపార్టీలకు వరం అయింది. ముఖ్యంగా తాము అధికారంలోకి వస్తే కేంద్రంతో కొట్లాడి అయినా రాష్ట్రానికి ప్రత్యేకహోదా తెప్పిస్తామని ఎవరికివారు శపథాలు కూడా చేసేస్తున్నారు.


అన్ని రాజకీయపార్టీలకు మా పార్టీ ఏమీ అతీతం కాదంటూ పవన్ కల్యాణ్ కూడా ప్రత్యేకహోదా అంశాన్నే పట్టుకున్నాడు. తానింకా ఒక అడుగు ముందుకేసి మరీ రాష్ట్ర మేధావులతో ఒక జేఏసీ ని ఏర్పాటు చేసి ప్రత్యేకహోదా సాధించడానికి ఏం చేయాలి,ఎలా చేస్తే రాబట్టగలం అనే అంశాలకు సంబంధించిన కార్యాచరణకు పూనుకున్నాడు. ఇటీవలే దీనికి సంబంధించిన మీటింగ్ కూడా జరిగింది. రాష్ట్రంలోని మేధావులు, రాజకీయవేత్తలు ఈ మీటింగుకు హాజరయ్యారు. కానీ ఈ మీటింగ్ కు ఒక రాజకీయనేత వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆయన ఎవరో కాదు సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ.


వైసీపీ నుండి బయటకొచ్చిన తరువాత రాజకీయలకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఈ మీటింగుకు హాజరయ్యి పలు అనుమానాలకు తావిచ్చాడు. తాను త్వరలోనే జనసేన తీర్థం తీసుకొనబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గ కారణాలూ లేకపోలేదు. ఎందుకంటే 2004 లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తరువాత కేబినెట్లో మంత్రిగా కూడా చేసాడు. అంతేగాక రెండుసార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం కూడా ఉండడంతో ఇందుకు పవన్ కూడా స్వాగతం పలికే ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా అనుభవం గడించిన నాయకులు పార్టీని ఎంచుకోవడం పార్టీకి మంచి రోజులనే చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: