రాష్ట్రంలో ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ పాలిటిక్స్ న‌డుస్తున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ-టీడీపీల మ‌ధ్య టామ్ అండ్ జెర్రీ మాదిరి ఎపిసోడ్లు నిత్య‌కృత్య‌గా మారాయి. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. మైకులు విర‌గ్గొట్టుకుంటు న్నారు. తిట్టుకుంటున్నారు. లెక్క‌లు ప‌ద్దులు వేసుకుంటున్నారు. కూడిక‌లు, తీసివేత‌లు అంటూ హ‌డావుడి చేస్తున్నారు. మ‌రి ఇంత చేస్తున్న వారు రెండు పార్టీలూ ఎన్నిక‌ల నాటికి క‌లిసే ఉంటాయా?  విడిపోతాయా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. కానీ, ఈ విష‌యానికి వ‌చ్చే స‌రికి మాత్రం మా క‌న్నా గొప్ప మిత్రులు ఎవ‌రూ లేరంటూ ముక్తాయింపులు ఇస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఇలా ర‌గ‌డ‌లోంచే హోం మంత్రి, డిప్యూటీ సీఎం చిన‌రాజ‌ప్ప మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. 

Image result for andhrapradesh

బీజేపీ త‌మ‌తో(టీడీపీ) క‌లిసే ఉన్నా.. విప‌క్షం వైసీపీతో బంధం పెన‌వేసుకుంటోంద‌ని రాజ‌ప్ప వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలోనే జగన్ ఎప్పుడూ బీజేపీని విమర్శించరని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. అలాగే బీజేపీ నేతలు కూడా జగన్‌ను విమర్శించరని ఆయన చెప్పారు. బీజేపీ, జగన్ మధ్య రహస్య ఒప్పందం ఉందేమోనని అనుమానం వస్తోంద న్నారు. అవిశ్వాసం అంటే కూడా బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ మంత్రుల రాజీనామాలు వారి ఇష్టమన్నారు. మేం ఇప్పటికీ మిత్రధర్మాన్ని పాటిస్తున్నామని చినరాజప్ప పేర్కొన్నారు. ఏపీ బీజేపీ నేతలు వాస్తవ పరిస్థితిని కేంద్రానికి తెలపాలని వ్యాఖ్యానించారు.

Image result for bjp ysrcp

మొత్తానికి ఈ వ్యాఖ్య‌లు మ‌రో వివాదానికి దారితీసే ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీని నేరుగా విమ ర్శించిన నేత‌లు తాజాగా వైసీపీని ముడిపెట్టి చెప్ప‌డం అదికూడా అవిశ్వాసానికి మ‌ద్ద‌తు ఎందుకు ఇవ్వ‌లేద‌ని ప్ర‌శ్నిం చ‌డం చాలా విచిత్రంగా అనిపిస్తోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. నిజానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం.
Image result for chinarajappa
మ‌రి కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై రాష్ట్ర బీజేపీ నేత‌లు ఎక్క‌డైనా అవిశ్వాసం ప్ర‌క‌టిస్తారా? ఈ విష‌యం చిన‌రాజ‌ప్ప‌కు తెలియ‌దా?  లేక తెలిసే మాట్లాడుతున్నారా? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. అయితే, తాజాగా చిన‌రాజ‌ప్ప వ్యాఖ్య‌లు మ‌రో వివాదానికి మాత్రం దారితీసేలా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: