గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆయన ఆరోగ్యం విషమించిందని వచ్చిన వార్తలను, చికిత్స అందిస్తున్న ముంబైలోని లీలావతి ఆసుపత్రి వైద్యబృందం ఖండించింది. కాగా, ఈనెల 15 నుంచి పారికర్, లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఆదివారం నాడు ముంబైకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, లీలావతి ఆసుపత్రికి వెళ్లి పారికర్ ను పరామర్శించి వచ్చారు.
Manohar Parrikar Could Be Taken To US 'If Need Be', Says Goa Deputy Speaker
ఇక పారికర్‌ ఆరోగ్యం కుదుటపడుతోందని, కొన్ని పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమేనని, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపింది. గోవా రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మనోహర్ పారికర్ పాల్గొనే అవకాశాలు లేవని వార్తలు రాగా, వాటిని బీజేపీ ప్రతినిధులు ఖండించారు.
Image result for manohar parrikar
ఆయన ఆరోగ్యం కుదుటపడగానే, అసెంబ్లీకి వస్తారని సీఎం కార్యాలయం వెల్లడించింది. తాజాగా జేపీ నేత, గోవా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ మైఖెల్‌ లాబో తాజాగా మీడియాతో మాట్లాడుతూ... అవసరమయితే మెరుగైన వైద్యం కోసం పారికర్‌ను అమెరికాకు తరలిస్తామని తెలిపారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: