తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల వ్యవహరిస్తున్న తీరుపై అసహనం చెందుతున్నరు. ఈ సందర్భంగా గత కొంత కాలం నుండి కేంద్ర ప్రభుత్వంపై మెతక వైఖరి అవలంబిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు….ప్రస్తుతం కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.


ఈ సందర్భంగా గతంలో జరిగిన బడ్జెట్ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల మొండి వైఖరి కనబరచడంతో పార్లమెంట్ ఉభయ సభలలో తెలుగుదేశం పార్టీ నాయకులతో ఆందోళనలు నిరసనలు చేపించారు చంద్రబాబు. అయితే ఈ క్రమంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీపై చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించడంతో. ఏపీ బీజేపీ నేత‌ల తీరుపై చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.


ఇక, కేంద్రంలో బిజెపి పార్టీ ఉండ‌గా న్యాయం జ‌ర‌గ‌ద‌ని భావిస్తున్న ఆయ‌న పోరాటానికే స‌న్నద్ధ‌మ‌వుతున్నారు. చంద్రబాబునాయుడు అడుక్కోవ‌డాల్లేవ్‌.. పోరాట‌మే అనే వ్యాఖ్య‌లు చేసారంట తెలుగుదేశం పార్టీ నాయకులతో.


ఈ క్రమంలో ముందుగా కేంద్ర మంత్రుల‌ను రాజీనామా చేయించ‌డం, ఆ త‌ర్వాత ఎంపీల‌తో రాజీనామా చేయించ‌డం లాంటి అంశాల‌ పైనా త్వ‌ర‌లోనే చంద్రబాబు ఓ నిర్ణ‌యం తీసుకోనున్నారనే వార్త‌లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో షికార్లు చేస్తున్నాయి. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం రాజ‌కీయ త్యాగానిక‌యినా సిద్ధం కావాల‌ని తెలుగుదేశం పార్టీ నాయకులకు సూచించారు చంద్రబాబునాయుడు. మొత్తంమీద చూస్తుంటే చంద్రబాబునాయుడు ప్రధాని మోడీ మీద కూడా యుద్దానికి సిద్ధమైనట్లు ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: