ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రఘువీరారెడ్డి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ పెడుతున్న అవిశ్వాస తీర్మానం పై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తో అవిశ్వాస తీర్మానం గురించి చర్చించామని తెలిపారు.


ఈ  క్రమంలో రాహుల్ గాంధీ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో ఉన్న పద్నాలుగు పార్టీల సభ్యులు సరిపోతారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత ఖర్గేకు రాహుల్ గాంధీ తగిన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు.


మరియు అదే విధంగా విభజన చట్టంలో ఏవైనా లోపాలుంటే సరిదిద్దాలని స్పష్టం చేశామని చెప్పారు కాంగ్రెస్ నాయకుడు రఘువీరారెడ్డి. ఈ సందర్భంగా కేంద్రం ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ పెట్టబోయే అవిశ్వాస తీర్మానం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని స్పష్టం చేశారు రఘువీరారెడ్డి .


తాజాగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెన్ను మార్పులు వస్తాయని.....అలాగే కాంగ్రెస్ పార్టి ఆంధ్రలో బలపడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: