ఏడేళ్ల బాలికను రేప్ చేసి హత్య చేసిన కేసులో.. చెన్నైలోని మహిళా కోర్టు నిందితుడికి మరణశిక్ష విధించింది. దశ్వంత్‌ను  కోర్టులో హాజరు పరచడానికి తీసుకురాగా, అక్కడున్న మహిళలు అతడిని చితకబాదారు. అతికష్టం మీద పోలీసులు దశ్వంత్‌ని వారిబారినుంచి రక్షించి, తీర్పు వెలువడిన అనంతరం జైలుకు తరలించారు. 
రేప్ కేసులో చెన్నై ఉన్మాదికి మరణశిక్ష
ముగలివక్కం అపార్ట్ మెంట్ లో నిందితుడు దశ్వంత్ 2017, జనవరి 5న ఓ బాలికపై అత్యాచారం చేసి ఆ తర్వాత చంపేశాడు. ఏడేళ్ల బాలిక కొద్ది దూరంలో ఆడుకుంటుండగా దశ్వంత్ ఆమెకు చాక్లెట్లు,బిస్కెట్లు ఆశ చూపించి తీసుకు వెళ్లాడు,ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఏడవటం,అరవడం చేయడంతో చంపేశాడు. మృతదేహాన్ని ఓ సూట్ కేస్ లో పెట్టి.. రోడ్డు పక్కన పడేశాడు.
Image result for దశ్వంత్ ఏడేళ్ల బాలిక
ఆ తర్వాత మరుసటి రోజు అక్కడకు వెళ్లి శవాన్ని కాల్చేశాడు. ఆ తర్వాత అతనే పోలీసులకు శవం గురించి ఫిర్యాదు చేశాడు. అయితే సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా.. దశ్వంత్‌ను నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది.  30 మంది సాక్ష్యుల ఆధారంగా దశ్వంత్‌ను దోషిగా తేల్చారు.తనకు తక్కువ శిక్ష వేయాలని జడ్జిను నిందితుడు దశ్వంత్ కోరాడు. ఇది తీవ్రమైన నేరం అని.. మరణశిక్ష సరైన తీర్పు అంటూ వ్యాఖ్యానించారు న్యాయమూర్తి.

ఏడేళ్ల చిన్నారిపై రేప్ చేసిన టెక్కీకి ఉరిశిక్ష ఖరారు..!


మరింత సమాచారం తెలుసుకోండి: