తెలంగాణ సీఎం కేసీఆర్ తన పుట్టిన రోజున ఓ మాజీ ఎమ్మెల్యేకు మాత్రం ఏదో ప్రత్యేక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు‌‌, ఇతర ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కూడా కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమయంలోనే కొమ్మూరితో కేసీఆర్ ప్రత్యేకంగా మాట్లాడినట్లు పలువురు నేతలు చెబుతున్నారు. నిజానికి వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. 

Image result for కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

గతంలో చేర్యాల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గెలిచారు. అయితే తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు కొమ్మూరి పెద్ద మొత్తంలో అవసరమైనప్పుడల్లా డబ్బులు అందజేశారనే టాక్ ఉంది. ఈ క్రమంలో అనేక రాజకీయ పరిణామాల మధ్య కొమ్మూరి టీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కాంగ్రెస్ నుంచి పొన్నాల లక్ష్మయ్య బరిలో ఉండగా ముత్తిరెడ్డి విజయం సాధించారు. సుమారు నెల రోజుల క్రితం కొమ్మూరి బీజేపీకి రాజీనామా చేశారు. 

Image result for kcr

అయితే అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ధ్రువీకరించారు. కానీ ఇప్పటికీ ఆయన టీఆర్ఎస్‌లో చేరలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అనేక వివాదాల్లో చిక్కుకోవడం, వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇన్ని రోజులుగా ఆయన టీఆర్ఎస్ లో చేరకపోవడానికి కారణం సీఎం కేసీఆర్ హామీ ఇవ్వకపోవడమేనని సమాచారం. 

Related image

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లిన ప్రతాప్ రెడ్డితో కేసీఆర్ ప్రత్యేకంగా మాట్లాడడం, ఆయన ఎంతో సంతోషంగా బయటకు రావడంతో కేసీఆర్ కీలక హామీ ఇచ్చి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఎన్నికలు సమీపిస్తున్న వేళా జనగామలో అధికార టీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం చాలా మందే పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎవరికి వారు మంత్రులు హరీశ్, కేటీఆర్ చుట్టూ తిరుగుతుండడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: