అది 2015... గ‌త‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు  ముఖ్య అతిథిగా భార‌త్‌కు విచ్చేసిన అప్ప‌టి అమెరికా అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబమాను స్వాగ‌తించ‌డానికి నియ‌మ‌నిబంధ‌న‌ల‌ను ప్ర‌క్క‌నపెట్టిమ‌రి  విమ‌నాశ్ర‌యానికి   వెళ్లారు  ప్ర‌ధాని  మోదీ.  ఈ మద్య కెన‌డా  ప్ర‌ధాని అయిన  జ‌స్టిన్ ట్రూడోనుస్వాగ‌తించ‌డానికి ఆస‌క్తి చూపించ‌లేదు.   గ‌త నెల ఇశ్రాయేలు  ప్ర‌ధాని అయిన నెతాన్యాహును సైతం  సాద‌ర స్వాగ‌తం ప‌లికిన మోదీ జ‌స్టిన్ ట్రూడోను ఉపేక్షించడంతో స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.
Image result for కెన‌డా ప్ర‌ధాని
శ‌నివారం భార‌త్ ప‌ర్య‌ట‌న‌కు విచ్చేసిన జ‌స్టిన్ ట్రూడోను వ్య‌వ‌సాయ శాఖ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ ఆహ్వానించ‌డం క‌నీసం విదేశాంగ శాఖ మంత్రి సుష్మ‌స్వ‌రాజ్ సైతం  అక్క‌డ లేక‌పోవ‌డంతో కెన‌డా ప్ర‌ధానికి న‌రేంద్ర మోదీకి మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌న్న విమ‌ర్శ‌ల‌కు మోదీ తావిచ్చారు. ఆదివారం తాజ్‌మ‌హాల్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ట్రూడోకు ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ సీఎం ఆదిత్య‌నాథ్ దూరంగా ఉన్నారు. అనంత‌రం సోమ‌వారం అహ్మ‌దాబాద్ స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించిన ట్రూడో ప‌క్క‌న మోదీ లేక‌పోవ‌డంతో ఈ అనుమానాల‌కు బ‌లం చేకుర్చిన‌ట్లైంది. 

justin-trudeau-visit-taj-mahal

ఎందుకీ దూరం?
కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో ఖ‌లీస్థాన్‌ను స‌మ‌ర్థించ‌డం వ‌ల్ల‌నే  ఇద్దరి మ‌ధ్య  స‌ఖ్య‌త లేక‌పోవ‌డానికి కార‌ణ‌మ‌ని  ట్రూడో ప్ర‌భుత్వం సిక్కు వేర్పాటువాదులకు అండ‌గా నిలిచి వారి డిమాండ్ల‌ను స‌మ‌ర్థించ‌డం మోదీకి మింగుడు ప‌డ‌లేద‌ని ఈ నేప‌థ్యంలోనే మోదీ  కెన‌డా ప్ర‌ధాని ట్రూడోకు స‌రైన ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు విశ్లేషించారు. ఖ‌లీస్థాన్ ఉద్య‌మానికి ట్రూడో అండ‌గా  నిల‌వ‌డంతో కొన్నేళ్ల క్రితం పంజాబ్ సీఎం అయిన అమ‌రిందర్ సింగ్ ట్రూడోను ఉద్ధేశిస్తూ ఖ‌లీస్తాన్ వేర్పాటు వాదుల‌ను స‌మ‌ర్థించ‌డం మంచిది కాదంటూ లేఖ రాశారు. సంవ‌త్స‌రం క్రితం కెన‌డా ర‌క్ష‌ణశాఖ మంత్రి హ‌ర్జిత్ స‌జ్జాన్ భార‌త్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌పుడు ఖ‌లీస్తాన్ వేర్పాటు వాదుల‌తో స‌బంధాలు ఉన్నాయ‌న్న కార‌ణం చేత కెప్టెన్  అమ‌రీంద‌ర్ సింగ్  మంత్రి హ‌ర్జిత్ క‌ల‌వ‌డానికి  విముఖ‌త చూపారు. 

Image result for కెన‌డా ప్ర‌ధాని

ఖ‌లీస్తాన్ అంటే? 
ఖ‌లీస్తాన్ అంటే ప‌విత్ర భూమి, ప‌రిశుద్ధ భూమి అని అర్థం  త‌మకు ప్ర‌త్యేక దేశం కావాలంటూ కొంత మంది సిక్కు వేర్పాటు వాదులు స్థాపించిన ఉద్యమ‌మే ఖ‌లీస్తాన్ ఉద్య‌మం 1970లో ఉపందుకున్న ఈ ఉద్య‌మం ఇప్ప‌టికీ కొన‌సాగుతునే ఉంది సిక్కుల‌కు ప్ర‌త్యేక దేశం ఉండాలంటూ కొంత మంది సిక్కు వేర్పాటు వాదులు,  ప్ర‌వాసా భార‌తీయులు ఈ ఉద్య‌మాన్ని ఇప్ప‌టికీ పెంచి పోషిస్తున్నారు.
Image result for canada prime minister
పంజాబ్, హ‌ర్యానాలో కొన్ని ప్రాంతాలు, హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్, రాజ‌స్తాన్, జ‌మ్ము, క‌శ్మీర్‌ను క‌లిపి ఓ దేశంగా ఏర్పాటు చేసి  సిక్కుల‌కు ప్ర‌త్యేక దేశం ప్ర‌క‌టించాల‌న్న‌దే వీరి డిమాండ్. అయితే ఇటువంటి డిమాండ్ల‌ను క‌లిగిన సిక్కు వేర్పాటు వాదుల‌ను చాలామంది సిక్కులు  వ్య‌తిరేకించ‌డం గ‌మ‌నార్హం. ఇలాంటి కోరిక‌ల‌ను  క‌లిగిన ఖ‌లీస్థాన్ వేర్పాటువాదులను కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో స‌మ‌ర్థించ‌డం వ‌ల‌నే ప్రధాని మోదీ ట్రూడోను క‌లిసేందుకు స‌ముఖ‌త వ్య‌క్తం చేయ‌లేద‌ని  రాజ‌కీయ విశ్లేష‌కులు విశ్లేషించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: