ఈ మద్య కొంత మంది బడాబాబులు డబ్బు సంపాదించడానికి యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. డ్రగ్స్, హైటెక్ వ్యభిచారం, రేవ్ పార్టీలు అంటూ..యువతకు వల విసురుతూ అడ్డగోలు డబ్బు సంపాదిస్తున్నారు.  ఇలాంటి వారికి పోలీసులు అధికారుల, పొలిలికల్ లీడర్స్ అండదండలు ఉండటంతో..వారి ఇష్టారాజ్యం అయ్యింది. పలు సందర్భాల్లో రేవ్ పార్టీల పై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు..నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నారు..కానీ ఫలితం మాత్రం శూన్యం. బెయిల్ పై విడుదలైన మరికొంత కాలానికే వారి కార్యకలాపాలు మొదలు పెడుతున్నారు. 
Image result for RAVE PARTIES HYDERABAD
తాజాగా కర్నూలు పట్టణంలోని ఓ లాడ్జీలో అశ్లీల నృత్యాలతో పాటు వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో షీ టీమ్స్‌కు చెందిన మహిళా ఎస్ఐ ఆ లాడ్జీలో తనిఖీల కోసం వెళ్లింది.  నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ ఎరువుల కంపెనీ తమ డీలర్లకు విందు పార్టీని ఏర్పాటు చేసింది. ఇందులో నృత్యాలు చేయడానికి హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువతులను తీసుకొచ్చింది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన పార్టీ రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. రాత్రి 9 గంటల నుంచి యువతులు ఆశ్లీలంతో నృత్యాలు చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది.
Image result for RAVE PARTIES HYDERABAD
దాదాపు 25 మంది ఉన్న పార్టీలో అందరూ తాగి తూగుతూ ఆశ్లీలంగా యువతులతో కలసి నృత్యాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న షీటీమ్  షీ టీమ్‌ ఎస్‌ఐ విజయలక్ష్మీ ఆధ్వర్యంలో రేవ్ పార్టీపై దాడి చేశారు. గది లోపల జరుగుతున్న తంతు.. అక్కడున్న ఓ అధికారిని చూసి ఆమె విస్తుపోయారు. చేసేదేమీ లేక మొత్తం తతంగాన్ని వీడియోలో చిత్రీకరించి, పై అధికారులకు చేరవేసింది. 
Image result for RAVE PARTIES HYDERABAD
పోలీసులను చూడగానే ఆ సీఐ వారిపైనే దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. చివరకు పోలీసులను భయభ్రాంతులకు గురి చేసి వారిని తోచుకుంటూ సీఐతో సహా అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.  ప్రస్తుతం జిల్లా పోలీసు కార్యాలయంలో కీలక అంశాలు రాబట్టే విభాగంలో సీఐగా ఉన్నారు. షీ టీమ్‌ బృందాల రాకతో లోపల ఉన్న మిగతా వారంతా పరారయ్యారు. ముగ్గురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ముగ్గురు యువతులను అరెస్టు చేశారు. ఇందులో ముగ్గురు యువతులపై తప్ప మిగిలిన 9 మందిపై కేసులు నమోదు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: